close
పర్యాటకులపై సౌదీ ఆంక్షలు

రియాద్‌: పర్యాటక రంగానికి ఊతమివ్వడానికి సౌదీ అరేబియా చారిత్రక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలిసారిగా పర్యాటక వీసాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే, సౌదీకి వెళ్లే పర్యాటకులు ఎలా మసులుకోవాలనే విషయంలో కొన్ని ఆంక్షలు విధించింది. అక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా నడుచుకునేవారికి జరిమానాలు విధిస్తామని తెలిపింది. వస్త్రధారణ, ప్రవర్తన విషయంలో పర్యాటకులు పద్ధతిగా ఉండాలని 19 కొత్త నియమాలు తీసుకొచ్చింది. వీటిలో దేన్ని ఉల్లంఘించినా భారీగా జరిమానాలు విధిస్తామని వెల్లడించింది. ప్రముఖ యాత్రా స్థలాల్లో, మసీదుల్లో బిగుతుగా వుండే వస్త్రాలు ధరించడాన్ని నిషేధించింది.  సౌదీ అరేబియా పద్ధతుల గురించి తెలియాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

2030 నాటికి దేశ పర్యాటక రంగం నుంచి అధిక ఆదాయాన్ని ఆర్జించాలన్న ఉద్దేశంతో సౌదీ తొలిసారిగా పర్యాటక వీసాలను జారీ చేయనుంది. యూఎస్‌, ఆస్ట్రేలియా, యురోపియన్‌ దేశాలతో పాటు 49 దేశాలకు ఈ-వీసా, వీసాలను జారీ చేస్తామని తెలిపింది. శుక్రవారం నుంచి ఇందు కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అదే రోజు నుంచి వీసా దరఖాస్తులను  ఆహ్వానిస్తోంది. విదేశీ పర్యాటకులకు నిర్దేశించిన నిబంధనల వివరాలు ఈ సైట్‌లో ఉంచారు.

వార్తలు / కథనాలు

మరిన్ని