close
ఆరోగ్య బీమా ఉంటేనే అమెరికాలోకి ఎంట్రీ!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. వలసదారులపై ప్రభావం చూపే మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆరోగ్య బీమా లేని, వైద్య ఖర్చుల్ని భరించే స్తోమత లేని వలసదారులను దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టంచేశారు. ఈ మేరకు ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ఆరోగ్య పరిరక్షణ విధానానికి భంగం కలిగించబోమని నిరూపించే వారికి మాత్రమే వీసాలు జారీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు నవంబరు 3వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయని శ్వేత సౌధం వర్గాలు ప్రకటించాయి. వీసాకు దరఖాస్తు చేసుకునే వలసదారులు 30 రోజుల్లోగా ఆరోగ్య బీమా తీసుకుంటామని లేదా ఆరోగ్య ఖర్చుల్ని భరించగలమన్న భరోసా గానీ ఇవ్వాలని, లేని పక్షంలో వారి వీసాను తిరస్కరిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల్ని అడ్డుకొని.. అమెరికా పౌరులకు మెరుగైన వైద్య సేవల్ని అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని