close
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

కాన్సస్‌ సిటీ: అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఇక్కడి కాన్సస్‌ సిటీలోని బార్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బార్‌లోకి అడుగుపెట్టిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో మొత్తం 9 మంది గాయపడగా.. అందులో నలుగురు మరణించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

వార్తలు / కథనాలు

మరిన్ని