close
‘నాటా’ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వాషింగ్టన్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని అక్కడి తెలంగాణ వాసులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తెలంగాణవాసులు ఈ సంబరాలకు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులతో సంబరాలకు వచ్చిన మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. అనంతరం చుట్టూ చేరి బతుకమ్మ పాటలకు సంప్రదాయ బద్దంగా ఆడిపాడారు. చిన్నారులు సైతం కోలాటం ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. తెలంగాణవాసులంతా ఒక్క చోట కలవడంతో విదేశాల్లో ఉన్నామన్న భావన తమలో పోయిందని అక్కడి వచ్చిన వారు అభిప్రాయపడ్డారు. ప్రతి యేటా నిర్వహించే విధంగానే ఈ సారి కూడా ‘నాటా’ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించగా తెలంగాణవాసుల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు.

 

 


వార్తలు / కథనాలు

మరిన్ని