close
ఆస్ట్రేలియాలో వైభవంగా బతుకమ్మ సంబరాలు

సిడ్నీ: ‘ఒక్కేసి.. పువ్వేసి చందమామ’ అంటూ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆస్ట్రేలియాలోని తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని అక్కడి తెలంగాణ వాసులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తెలంగాణవాసులు సిడ్నీలో నిర్వహించిన ఈ సంబరాలకు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులతో సంబరాలకు వచ్చిన మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. అనంతరం చుట్టూ చేరి బతుకమ్మ పాటలకు సంప్రదాయ బద్దంగా ఆడిపాడారు. ఈ సంబరాలు తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని వారు తెలిపారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని