close
మలేసియాలో బతుకమ్మ సంబరాలు

కౌలాలంపూర్‌: మలేసియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ కట్టుబాట్లు, సంప్రదాయాలను అనుసరిస్తూ బతుకమ్మ పండుగను మలేసియాలోని తెలంగాణకు చెందిన వారు అట్టహాసంగా జరుపుకున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో తెలంగాణ వారు తరలి వచ్చారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆటపాటలతో బతుకమ్మలాడుతూ సందడిగా గడిపారు. మలేసియాలోని సెలంగోర్ స్టేట్ మినిస్టర్ గణపతి రావు, మలేసియా తెలుగు సంఘం ప్రెసిడెంట్ డా.అచ్చయ్య కుమార్ రావు, మలేసియా తెలుగు పునాది ప్రెసిడెంట్ కాంతారావు, మలేసియాలో భారతీయ హైకమిషన్ లేబర్ వింగ్ సెక్రటరీ లక్ష్మీకాంత్, పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మలేసియా తెరాస వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, పలువురు తెలంగాణకు చెందిన ప్రముఖులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేస్తూ బతుకమ్మ విశిష్టతను మైటా అధ్యక్షుడు సైదం తిరుపతి వివరించారు.

బతుకమ్మ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉత్సవాలలో మహిళలు, చిన్నారులు బతుకమ్మలను రంగురంగుల పూలతో అందంగా పేర్చారు. అనంతరం దాండియా ఆటలు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడిపాడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమాలకు హాజరైన పలువురు తెలంగాణ కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన మైటా కోర్ కమిటీ, వాలంటీర్లు, మైటా సభ్యులకు ప్రెసిడెంట్ సైదం తిరుపతి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల నిర్వహణకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించిన మైటా డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రెజరర్ మారుతీ, జాయింట్ ట్రెజరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్ అశ్విత, యూత్ వింగ్ ప్రెసిడెంట్ కార్తీక్, యూత్ వింగ్‌ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, యూత్ వింగ్‌ వైస్ ప్రెసిడెంట్ రవితేజ, కల్చరల్ వింగ్ సభ్యులు విజయ్ కుమార్, చందు, రామకృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, మైగ్రెంట్ వింగ్ సభ్యులు ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్ తదితరులందరినీ మైటా అధ్యక్షుడు సైదం తిరుపతి అభినందించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని