close
సమైఖ్య తెలుగు వేదిక ఆధ్వర్యంలో దసరా వేడుకలు

స్టట్గార్ట్‌: జర్మనీలోని స్టట్గార్ట్‌ నగరంలో సమైఖ్య తెలుగు వేదిక ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ వేడుకలు ఎంతో ఉల్లాసంగా జరిగాయి. ఈ వేడుకలకు స్టట్గార్ట్‌ ప్రాంతానికి చెందిన దాదాపు 300 మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఎంతో సంతోషంగా గడిపారు. గ్రేటర్‌ స్టట్గార్ట్‌లో నివసిస్తున్న తెలుగువారందరినీ ఏకం చేసేందుకే ఏటా బతుకమ్మ, దసరా, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమైఖ్య తెలుగు వేదిక ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రవాస భారతీయులకు తెలుగు సమాఖ్య వేదిక బృందం కృతజ్ఞతలు తెలియజేసింది.

వార్తలు / కథనాలు

మరిన్ని