close
అమెరికాలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

కాన్సాస్‌: అమెరికాలోని కాన్సాస్‌లో గ్రేటర్‌ కాన్సాస్‌ తెలుగు సంఘం (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక హిందూ దేవాలయంలో ఈ వేడుకలను వైభవంగా జరిపారు. ఇంతవరకు కాన్సాస్‌ నగరంలో నిర్వహించని విధంగా దసరా, బతుకమ్మ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని.. దీనికి దాదాపు 1500 మందికిపైగా హాజరైనట్లు సంఘం సభ్యులు తెలిపారు. దేవాలయ అర్చకులు శ్రీనివాస చార్యులు పర్యవేక్షణలో గౌరీ పూజలో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయపద్ధతిలో ఎంతో వైభవంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. మహిళలు, చిన్నారులు, పిల్లలు, పెద్దలు అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొని సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమానికి అదితి బావరాజు, శ్రీకాంత్‌ లంక వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

దసరా, బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ తయారీ విధానం, గోరింటాకు అలంకరణలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి బతుకమ్మ పాటలతో ఆడుతూ.. పాడుతూ.. ఉల్లాసంగా గడిపారు. నృత్య ప్రదర్శనలు, కోలాటాలతో ఆనందంగా గడిపారు. ఉత్సవాల్లో పాల్గొన్న వారిలో కొంత మందిని ఎంపిక చేసి రకరకాల విభాగాల్లో బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ గ్రేటర్‌ కాన్సాస్‌ తెలుగు సంఘం అధ్యక్షుడు శివ తీయగూర కృతజ్ఞతలు తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని