close
కెనడాలో శోభాయమానంగా శరన్నవరాత్రులు

ఆల్బెర్టా: కెనడాలోని ఆల్బెర్టాలో శరన్నవరాత్రులు వైభవంగా జరిగాయి. ఆల్బెర్టాలోని అనఘా సాయిబాబా మందిరంలో శరన్నవరాత్రులు అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు లలిత, శైలేష్‌, వాలంటీర్లు శరన్నవరాత్రులను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజ్‌కుమార్‌ శర్మ నేతృత్వంలో ప్రతినిత్యం ప్రత్యేక అలంకరణలు, హోమాలు, అభిషేకాలతో శరన్నవరాత్రుల విశిష్టతను వివరించారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవి, గాయత్రీ మాత, అన్నపూర్ణా దేవి, లలితాత్రిపుర సుందరి, శ్రీమహాలక్ష్మి, సరస్వతి, దుర్గామాత, మహిశాసుర మర్దని, శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారాల్లో అమ్మవారు నిత్యపూజలు అందుకుంది. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలతో సాయిబాబా నిత్య విశిష్ట భక్తి పూజలతో అత్యంత వైభవంగా శరన్నవరాత్రులను జరిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు స్థానిక కళాకారులు చేసిన భరతనాట్యం ప్రదర్శన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాదాపుగా 450 కుటుంబాలు భక్తి శ్రద్ధలతో ఈ శరన్నవరాత్రుల్లో పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని