close
ఆక్లాండ్‌లో బతుకమ్మ ఉత్సవాలు

హాజరైన న్యూజిలాండ్‌ ఎంపీ ప్రియాంక

ఈనాడు, హైదరాబాద్‌: సిరిసిల్ల బతుకమ్మ చీరలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని న్యూజిలాండ్‌ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్‌ తెలిపారు. ఆక్లాండ్‌లో ఆదివారం బతుకమ్మ వేడుకలు జరిగాయి. న్యూజిలాండ్‌ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో బతుకమ్మ చీరల ప్రదర్శన నిర్వహించారు. నేత కార్మికుడు హరిప్రసాద్‌ తయారు చేసిన చీరను ఎంపీ ప్రియాంక ధరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాండ్‌ వ్యవస్థాపకురాలు సునీతా విజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న బతుకమ్మ చీరల పథకం మహిళలకు వరంగా మారిందని చెప్పారు. న్యూజిలాండ్‌ తెలంగాణ సంఘం అధ్యక్షుడు నరేందర్‌ రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని