close
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డుప్రమాదం

35 మంది మృతి

మదీనా: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదీనా ప్రావిన్స్‌లోని అల్‌ అఖల్‌ సెంటర్‌ వద్ద యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు.. భారీ వాహనాన్ని(ప్రోక్లెయినర్‌) ఢీకొట్టింది. పవిత్ర క్షేత్రం మక్కా సమీపంలో బుధవారం రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విదేశీయులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను అల్‌ హమ్నా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన బస్సులో ఏషియన్‌, అరబిక్‌ పౌరులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

వార్తలు / కథనాలు

మరిన్ని