close
311 మంది భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో

అమెరికాకు అక్రమంగా వెళుతున్నారన్న కారణంతో

దిల్లీ: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారన్న కారణంతో 311 మందితో కూడిన విమానాన్ని మెక్సికో వెనక్కి పంపింది. అంతర్జాతీయ ఏజెంట్ల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి కొన్ని నెలలుగా కొందరు భారతీయులు మెక్సికోలో తలదాచుకుంటున్నారు. ఇందుకు గానూ ఒక్కో వ్యక్తి రూ.25-30 లక్షల వరకు ఏజెంట్లకు చెల్లించినట్లు సీనియర్‌ ఇమ్మిగ్రేషన్ అధికారి తెలిపారు. వారం రోజుల నుంచి నెలలోపు అమెరికా చేర్చే విధంగా ఏజెంట్లు బాధితులతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. వారికి వసతి, భోజనం, విమాన టికెట్ల సౌకర్యాలు ఏజెంట్లే కల్పించారన్నారు. ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌ ద్వారా వారిని మెక్సికోకి చేర్చినట్లు గుర్తించారు. అలా ఇప్పటి వరకు 311 మంది భారతీయులు మెక్సికోకు చేరారు. అయితే, తాజాగా మరో 60మందిని వీరికి ఎస్కార్టులుగా విమానంలో అమెరికాకు పంపుతుండగా మెక్సికో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పట్టుకున్నారు. వీరిలో 310 మంది పురుషులు ఉండగా.. ఓ మహిళ ఉంది. ఎక్కువ మంది పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు.


వార్తలు / కథనాలు

మరిన్ని