close
దిల్లీకి చేరుకున్న 311 మంది భారతీయులు

దిల్లీ: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారన్న కారణంతో 311 మంది భారతీయులను మెక్సికో నిన్న వెనక్కి పంపిన విషయం తెలిసిందే. వారంతా బోయింగ్ 747-400 చార్టర్‌ విమానంలో శుక్రవారం ఉదయం 5గంటలకు దిల్లీ చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత కొన్ని గంటల పాటు వారిని విమానాశ్రయంలోనే ఉంచారు. తర్వాతి చర్యల నిమిత్తం వారి వారి రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. వీరిలో 310 మంది పురుషులు ఉండగా, ఓ మహిళ ఉంది. దిల్లీలో దిగే సమయానికి వీరి చేతిలో ఎలాంటి లగేజ్‌ లేదు. అంతర్జాతీయ ఏజెంట్లు వీరిని మెక్సికోలోని పలు నగరాల్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఓక్సాకా, బజా కాలిఫోర్నియా, మెక్సికో సిటీ, వెరాక్రూజ్‌, చియాపాస్‌, సొనోరా, దురాంగో, టబాస్కో నగరాల్లో వీరికి వసతి ఏర్పాటు చేశారు. వీరిలో కొందరు కొన్ని వారాల క్రితమే వెళ్లగా..మరి కొందరు మాత్రం కొన్ని నెలలుగా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లు వీరి వద్ద రూ.25-30 లక్షల వరకు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది పంజాబ్‌కు చెందిన వారే.

అమెరికా చురక..
భారతీయులను మెక్సికో వెనక్కి పంపడంపై అమెరికా స్పందించింది. ‘ దేశ సరిహద్దుల నిబంధనలను మెక్సికో సరిగ్గా పాటిస్తోంది.అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఇదో బలమైన సందేశం’ అంటూ చురకలు అంటించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్‌ అధికారి మార్క్‌ మోర్గాన్‌ ట్వీట్‌ చేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని