close
అమెరికాలోని పాఠశాలలో కాల్పులు

కాలిఫోర్నియా: అమెరికాలోని ఒక పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి తన సహచర విద్యార్థిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడ నుంచి కాల్పులు జరుపుతూ పారిపోయాడు. అనుమానిత విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల బయట మరో విద్యార్థితో వాగ్వాదం జరగడంతో అతడు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో దాదాపు 10వేల మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ ఘటనతో సమీపంలో ఉన్న స్కూళ్ల నుంచి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  కాల్పుల్లో ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని