close
లూయివిల్‌లో దసరా సంబరాలు

లూయివిల్‌: అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయివిల్ నగరంలో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ కెంటకియానా (టాక్) ఆధ్వర్యంలో దసరా సంబరాలు వైభవంగా జరిగాయి. సంస్థ ప్రెసిడెంట్‌ లూర్దు రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి సౌజన్య, శ్రీరామ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. శ్రీనివాస్ వేమూరి, తేజశ్రీ ప్రకాష్ సాంస్కృతిక కార్యదర్శులుగా వ్యవహరించారు. కెంటకీ అటార్నీ జనరల్ ఆండీ బషైర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. తెలుగు వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో తెలుగువారి పాత్రను కొనియాడారు. బోర్డు ట్రస్టీ డాక్టర్ సురేష్ కొడాలి ఆయనను పుష్పగుచ్ఛంతో సత్కరించారు. యూనివర్సిటీ అఫ్ లూయివిల్ ప్రెసిడెంట్ డాక్టర్ నీలి బెండపూడి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. 220 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి మొట్ట మొదటి మహిళా ప్రెసిడెంట్‌గా ఒక తెలుగు మహిళ ఎన్నిక కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని సంస్థ చైర్మన్ డాక్టర్ సురేష్ కాసరనేని ఈ సందర్భంగా ప్రశంసించారు.

కార్యక్రమంలో సినీగీతాలకు చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. గురు వందన, నృత్య కేంద్ర డాన్స్ అకాడమీల ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. అనిల్ గంటేటి బృందం ప్రదర్శించిన ‘బొంగులో హాస్పిటల్’ స్కిట్ నవ్వించింది. మనబడి చిన్నారులు ‘ఎంతో మధురం ఈ జీవితం’ నాటకాన్ని ప్రదర్శించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు లిప్సిక, రఘురాం నిర్వహించిన సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాంస్కృతిక కార్యక్ర్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. కమిటీ సభ్యులకు, యూత్ వాలంటీర్లకు, కళాకారులకు ఉపాధ్యక్షురాలు లక్షి అడ్డాల ధన్యవాదాలు తెలియజేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని