close
బ్రెజిల్‌ వెళ్లాలంటే ఇక వీసా అవసరం లేదు..!

బ్రెజిల్‌: దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌ను సందర్శించేందుకు ఇక నుంచి వీసా అవసరం ఉండకపోవచ్చు. ఆ దేశంలో పర్యటించే భారతీయ, చైనా పర్యాటకులు, వ్యాపారస్థులకు వీసా అనుమతుల నుంచి మినహాయింపునిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో గురువారం ప్రకటించారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయన అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అభివృద్ధి చెందిన దేశాల పర్యాటకులు, వ్యాపారస్థులు బ్రెజిల్‌ను సందర్శించేందుకు వీసా అవసరాల్ని కుదించడమే తన విధానమని ప్రకటించారు. ఆ మేరకు అమెరికా, కెనడా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల నుంచి వచ్చేవారికి వీసా అనుమతుల్ని రద్దు చేశారు. తాజాగా ఈ విధానాన్ని భారత్‌, చైనా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని