close
మండలి బుద్ధ ప్రసాద్‌కు అరుదైన గౌరవం

నేపర్‌విల్లే (ఇల్లినాయిస్‌): ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాజకీయ వేత్తగా, తెలుగు భాషాభిమానిగా వివిధ రకాలుగా సమాజ సేవకు పాటుపడుతున్న ఆయనకు అమెరికా ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని నేపర్‌విల్లే నగరం ఘనంగా సన్మానించింది. నేపర్‌విల్లే నగరంలో అక్టోబర్‌ 25వ తేదీని ‘మండలి బుద్ధ ప్రసాద్‌ డే’గా ఆ నగర మేయర్‌ స్టీవ్‌ చిరికో ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

1999 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ్యుడిగా, మంత్రిగా, నవ్యాంధ్రలో డిప్యూటీ స్పీకర్‌గా ఆయన సేవలందించారని నేపర్‌విల్లే మేయర్‌ స్టీవ్‌ కొనియాడారు. అంతేగాక పశువుల సంరక్షణ కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఓ పరిశోధన కేంద్రాన్ని పులివెందులలో ఏర్పాటు చేశారని, మూడు వెటర్నరీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను వేర్వేరు ప్రాంతాల్లో నెలకొల్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గాంధీ సూత్రాలను పాటిస్తూ వాటి ఆచరణకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తెలుగు భాష, సంస్కృతి, ప్రపంచంలోని తెలుగు వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అంతేగాక పలు మ్యాగజైన్లు, పత్రికలకు తన రచనలు అందిస్తూ సమాజ సేవకు పాటుపడుతున్నారని అభినందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా నేపర్‌విల్లే నగరంలో అక్టోబర్‌ 25వ తేదీని ‘డాక్టర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ డే’గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని