close
నవనీతకృష్ణ మృతి వైద్యరంగానికి తీరని లోటు

డాలస్‌‌: ఇటీవల కన్నుమూసిన ప్రవాసాంధ్ర వైద్యుడు గొర్రెపాటి నవనీతకృష్ణకు ఏపీ తెదేపా కార్యదర్శి మన్నవ సుబ్బారావుతో పాటు పార్టీ ఎన్‌ఆర్‌ఐ నాయకులు నివాళులు అర్పించారు. డాలస్‌ నగరంలో బుధవారం ఆయన మృతి చెందగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. నివాళులు అర్పించిన అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారంతా ఏపీతో పాటు అమెరికాలో తెదేపా కోసం నవనీతకృష్ణ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

 ‘ డాలస్‌లో కార్డియాలజిస్టుగా, అమరావతి అమెరికా మెడికల్‌ సైన్సెస్‌ ఛైర్మన్‌గా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. గతంలో తానాకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆయన తల్లిదండ్రుల పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పాఠశాల భవనాలు, కల్యాణమండపాల నిర్మాణం వంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఎన్టీఆర్‌ అభిమానిగా తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో శ్రమించారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన పలు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనలో ఉండగా చాలా నగరాల్లో సభలు ఏర్పాటు చేసేవారు’ అని గుర్తు చేసుకున్నారు. కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా నాయకులు నాదెండ్ల గంగాధర్‌, కాట్రగడ్డ కృష్ణప్రసాద్‌, మురళీ వెన్నం, లోకేష్‌నాయుడు, సాంబ దొడ్డ, కిరణ్‌ తుమ్మల, వెంకట్‌ జల్లెలమూడి, చలపతి కొండ్రకుంట, సతీష్‌ మండువ, శ్రీకాంత్‌ పోలవరపు, కృష్ణ కొరడ, నవీన్‌ యర్రమనేని, శ్రీనివాస్‌ శాఖమూరి, కిషోర్‌ చలసాని, ముత్యాల పద్మశ్రీ, ఆంజనేయులు కోనేరు, లక్ష్మీకాంత్‌ గొర్రెపాటి తదితరులు ఉన్నారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని