close
హెచ్‌1బీ వీసాదారులకు ఉపశమనం

వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న అనేక మంది భారతీయులకు అక్కడి కోర్టు తీర్పు ఊరట కలిపించింది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న ట్రంప్‌ సర్కార్‌ ఆదేశాల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని యూఎస్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ అప్పీల్‌ కొలంబియా సర్క్యూట్‌ దిగువ కోర్టును కోరింది. నిబంధనల్ని క్షుణ్నంగా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అప్పటి వరకు నిబంధనలను నిలుపుదల చేయడం ఉత్తమమని అభిప్రాయపడింది. అలాగే తుది తీర్పును కూడా నిలిపివేయాలని కోరింది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ ఒబామా సర్కార్‌ హెచ్‌-4వీసా విధానాన్ని 2015లో ప్రవేశపెట్టింది. అయితే దీని ద్వారా అనేక మంది అమెరికా వాసులు నష్టపోతున్నారని ట్రంప్‌ సర్కార్‌ భావించి హెచ్‌ 4 వీసా నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది.

 


వార్తలు / కథనాలు

మరిన్ని