close
స్కై డైవ్‌ చేస్తూ పెళ్లి మండపానికి..!

మెక్సికోలో భారతీయ వరుడి గ్రాండ్‌ ఎంట్రీ

మెక్సికో: పెళ్లికొడుకు మండపానికి ఘనంగా చేరుకోవడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ మెక్సికోలో భారత్‌కు చెందిన ఓ వరుడు చేసిన గ్రాండ్‌ ఎంట్రీ మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. పెళ్లి మండపానికి సాదాసీదాగా వస్తే థ్రిల్‌ ఏముంటుందనుకున్న ఆ పెళ్లికొడుకు ఏకంగా ఆకాశం నుంచి స్కైడైవ్‌ చేసుకుంటూ వచ్చాడు. మెక్సికోలో ఆకాశ్‌ యాదవ్‌ అనే వరుడు ఈ విధంగా విమానంలో నుంచి దూకి వివాహ వేదికకు చేరుకున్నాడు. దాదాపు 500అడుగుల ఎత్తు నుంచి ఆకాశ్‌ దూకగా.. కింద ఉన్న అతిథులు అతణ్ని ఉత్సాహపరిచారు. బోట్‌ ద్వారా చేరుకోవాలని మొదట భావించినా.. అనుమతి లేకపోవడంతో ఇలా స్కైడైవ్‌ చేసుకుంటూ వచ్చినట్లు ఆకాశ్‌ తెలిపాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


వార్తలు / కథనాలు

మరిన్ని