close
అమెరికాలో భారత విద్యార్థి హత్య

బెంగళూరు: మైసూరుకు చెందిన పాతికేళ్ల యువకుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో శుక్రవారం హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి అతడిని నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపాడు. మృతుడు అభిషేక్‌ సుధేశ్‌ భట్‌ కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు చదువుతున్నాడు. దీంతోపాటు స్థానికంగా ఉన్న హోటల్‌లో పార్ట్‌ టైం ఉద్యోగం కూడా చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎప్పటిలాగే ఉద్యోగం చేస్తుండగా హోటల్‌లోకి ప్రవేశించిన దుండగుడు తుపాకీతో కాల్చినట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో అభిషేక్‌ చదువు పూర్తి కానుంది. దుండగుడు అభిషేక్‌ను ఏ కారణం వల్ల చంపాడన్న విషయం తెలియాల్సి ఉంది. 

‘‘మృత దేహాన్ని భారత్‌కు రప్పించేందుకు మేం అమెరికా కాన్సులేట్‌, భారత హైకమిషన్‌ను సంప్రదించాం. అభిషేక్‌ ఎందుకు చనిపోయాడన్న అంశంపై మాకు ఇంకా స్పష్టత లేదు.’’ ఓ కుటుంబ సభ్యుడు తెలిపారు.

వార్తలు / కథనాలు

మరిన్ని