close
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు స్టాన్లీ(23) కాగా మరొకరు తెలుగు విద్యార్థి వైభవ్‌ గోపిశెట్టి(26)గా గుర్తించారు. టెనస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లే అనే పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులిద్దరూ టెనస్సీ స్టేట్‌ యూనివర్సిటీలో చదువుతున్నారు. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డేవిడ్‌ టోరెస్‌ అనే వ్యక్తి తన ట్రక్కుతో విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. నవంబర్‌ 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వార్తలు / కథనాలు

మరిన్ని