close
‘దిశ’ఘటనపై జోహెన్నెస్‌బర్గ్‌లో నిరసన

జోహెన్నెస్‌బర్గ్‌: తెలంగాణలో పశువైద్యురాలు ‘దిశ’ అత్యంత కిరాతకంగా హత్యాచారానికి గురికావడాన్ని దక్షిణాఫ్రికాలోని తెలుగు కమ్యూనిటీ(ఎస్‌ఏటీసీ) ఖండించింది.  ఆమె కుటుంబానికి న్యాయం జరగాలంటూ ఎస్‌ఏటీసీ సభ్యులు జోహెన్నెస్‌బర్గ్‌లో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసనలో ఎస్‌ఏటీసీ సభ్యులు విక్రమ్‌ పెట్లూరి, వెంకట్‌ మాగంటి, మనోజా రాజవరపు, సుష్మ బొడ్డుపల్లి, కీర్తిక తదితరులు పాల్గొన్నారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని