close
న్యూజెర్సీలో ఘనంగా దీపావళి సంబరాలు

న్యూజెర్సీ: న్యూజెర్సీలోని తెలుగు ప్రజలు దీపావళి సంబరాలను ఇటీవల ఘనంగా జరుపుకొన్నారు. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఈస్ట్‌బ్రౌన్స్‌ మిడిల్‌ స్కూల్‌లో నిర్వహించిన ఈ సంబరాలకు 1200 మంది ప్రవాస తెలుగుప్రజలు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు కళా సమితి అధ్యక్షులు ఉప్పల సుధాకర్ వేడుకలకు వచ్చిన వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కళా సమితి చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తెలుగువారి నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. యేలూరి వేణు, గోపు ప్రమీల ఆధ్వర్యంలో సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక కళాకారులతో నిర్వహించిన స్వరాభిషేకం సభికులను అలరించాయి. కమ్యూనిటీ కార్యదర్శి దరిసిపూడి ఉష, యువజన కార్యదర్శి గండి జ్యోతి, తెలుగుజ్యోతి సంపాదకులు విజ్ఞాన్ కుమార్ ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమం, తెలుగు పద్యాల పోటీలు సహా పలు ప్రదర్శనలు జరిగాయి. సాయంత్రం తెలుగు కళా సమితి ట్రస్టీ గేదెల దాము ఆధ్వర్యంలో విందు భోజనం నిర్వహించారు. విందు అనంతరం కొల్లూరి గిరిజ బృందం, కోటి, సందుగు శ్రీకాంత్‌, ప్రసాద్‌ సింహాద్రి, శిల్పారావు, సుమంగళి బృందం పాటలతో ఆకట్టుకోగా.. వారి పాటలకు మెహర్‌ చంటి వాద్య సహకారం అందించారు.  

ప్రముఖ మిమిక్రీ కళా కారుడు, ‘ఇమిటేషన్ రాజు’ హాస్య భరితమైన మిమిక్రీతో ప్రేక్షకులను మురిపించారు. సాహిత్య వింజమూరి వ్యాఖ్యానం, ఇమిటేషన్ రాజుతో కలిసి చేసిన నాట్యం అందరినీ ఎంతో అలరించింది. ఈ సందర్భంగా తెలుగు కళా సమితికి మరియు తెలుగు వారికి సేవ చేస్తున్న వారికి ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. టీపీ శ్రీనివాస రావు, సీతాల రామకృష్ణ, తీవన్లు ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. సుధ దేవులపల్లి, దివ్య ఏలూరి, ఇందిర రెడ్డి శ్రీమతి శ్రీలక్ష్మీ పర్చ నృత్య పురస్కారాలను అందుకొన్నారు. ఈ సందర్భంగా దీపావళి సంబరాలకు ధన సహాయం చేసిన దాతలకు, వివిధ సంస్థలకు కార్యవర్గ సభ్యులు సన్మానం చేశారు. ముఖ్య దాతలు ఎన్‌ఏటీఎస్‌, టాటా నాయకులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. 

తెలుగు కళా సమితి కార్య వర్గం, సలహాదారులు శంకరమంచి రఘు శర్మ గారి ఆధ్వర్యంలో గాయకుడు కోటికి సన్మానంతో పాటు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ.. తనకు లభించే ప్రతిఫల, సత్కారాలు, అభినందనలు తన తండ్రి రాజేశ్వరరావు, గురువు చక్రవర్తికే దక్కుతాయని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన ఆనంద్‌, సాలు జేమ్స్, రజని సింగతి, రేణు తాడేపల్లి, దక్షిన్ రెస్టారెంటు వారికి సమితి ధన్యవాదాలు తెలియజేసింది. కార్యక్రమంలో చిల్లర శ్రీధర్, జంబుల విలాస్, గోపి తాటి పాల్గొన్నారు. దాతలకు కార్యదర్శి మధు రాచకుళ్ళ ధన్యవాదాలు తెలిపారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని