close
సౌదీలో ఇద్దరు మంచిర్యాల వాసులమృతి

జన్నారం/దండేపల్లి గ్రామీణం: సౌదీలోని రియాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మంచిర్యాల జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. ద్విచక్రవాహనంపై పనులకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను జన్నారం మండలం రోటీగూడకు చెందిన ఉప్పు మల్లేశ్‌ (40), దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన నాంపల్లి రాజు (24)గా గుర్తించారు. వీరిద్దరూ మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లారు. మల్లేష్‌కు భార్య భాగ్య, డిగ్రీ చదువుతున్న ఇద్దరు కుమారులు రాకేశ్‌, వినయ్‌ ఉన్నారు. రాజుకు తల్లిదండ్రులు సత్తయ్య, రాజవ్వ, తమ్ముడు వెంకటేశ్‌, చెల్లెలు మౌనిక ఉన్నారు. పొట్టకూటి కోసం వెళ్లి మృత్యువాత పడడంతో ఆ రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

వార్తలు / కథనాలు

మరిన్ని