close
వైభవంగా ఉజ్జయిని మహంకాళీ బోనాలు

సింగపూర్‌: తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్‌ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సింగపూర్‌లో శ్రీఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాలు వైభవోపేతంగా జరుపుకున్నారు. స్థానిక హిందూ దేవాలయమైన శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో జూలై 21(ఆదివారం)న ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గా దేవికి బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, పులి వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు సుమారు 700 మంది తెలుగువారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ప్రజలందరిపై శ్రీ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మహిళలు బోనాలు సమర్పించారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా సొసైటీ ముందుకు కదులుతున్నట్లు టీసీఎస్‌ఎస్‌ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

ఈ బోనాల పండుగని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చెన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గా ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకటరమణ, పెరుకు శివరాం ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కాల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజా రమణి బొడ్ల, జూలూరి పద్మజ, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివప్రసాద్‌ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వేడుకలకు గోనె రజిత, దీపా నల్ల, సౌజన్య నంగునూరి, గార్లపాటి లక్ష్మారెడ్డి, ప్రదీప్ రెడ్డి, లక్కారి గంగాధర్, మడిగె రాజు, మల్లారెడ్డి మిట్టపల్లి, తౌట గంగాధర్, అనుపురం శ్రీనివాస్, జుట్టు ఉమేందర్, టి. శ్రీనివాస్, మంత్రి సాయిరాం, తుర్క శ్రీనివాస్, కటుకం మారుతి, మనోజ్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పోతురాజు, పులి వేషాలు వేసిన పాచంపల్లి శ్రీధర్, నేరెళ్ళ శ్రీనాథ్, చాడ సంతోష్‌ రెడ్డి, వెంగళదాస్ తిరుపతి, అద్ది మల్లేశంలకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని