close
తెలంగాణ వాసులతో మీట్‌ అండ్‌ గ్రీట్‌

న్యూయార్క్‌: అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ న్యూయార్క్‌లోని డీర్ పార్క్ నగరంలో నివాసముంటున్న తెలంగాణ మిత్రులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులను, తెరాస అవలంబిస్తున్న విధానాలను ఆయన వారికి వివరించారు. న్యూయార్క్‌లో నివాసం ఉంటున్న టీడీఎఫ్‌ మాజీ అధ్యక్షుడు ఏనుగు లక్ష్మణ్‌ను ఈ సందర్భంగా భాజపాలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆఫ్ భాజపా జాతీయ అధ్యక్షడు కృష్ణా రెడ్డి, యూత్ కో-కన్వీనర్ విలాస్ జంబుల, న్యూజెర్సీ యూత్ కో-కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నీలిమ మదన్, శివదాసన్,  ప్రదీప్ కట్ట, అమర్, శ్రీకాంత్, రవి తుమ్మ, యోగి, అనిత, విజయ, ఆనంద్, ఫణి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని