close
అమెరికాలో తెలుగు వారి సందడి

వర్జీనియా: అమెరికాలో తెలుగువారు సందడి చేశారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న వారి తల్లిదండ్రులు వర్జీనియా రాష్ట్రం యాష్‌బర్న్‌లోని హన్స్‌పర్త్‌ సెయింట్‌ పార్క్‌లో సమావేశమయ్యారు. ఏటా మగవారు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనే సంప్రదాయం ఉండగా మొదటిసారి సతీసమేతంగా హాజరయ్యారు. ఇంటి దగ్గర నుంచి  తెచ్చుకున్న స్వదేశీ రుచులను ఆరగిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. త్వరలో స్వదేశానికి రాబోతున్న అట్లూరి పాండురంగ స్వామి, సూరిశెట్టి కిశోర్‌, సాంబశివరావుకు వారంతా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమం విజయవాడ మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు ఆధ్వర్యంలో జరిగింది.


 

 

వార్తలు / కథనాలు

మరిన్ని