close
వైభవంగా బోనాల ఉత్సవాలు

సిన్సినాటి: అమెరికాలోని సిన్సినాటి నగరంలో గ్రేటర్‌ సిన్సినాటి తెలంగాణ అసోసియేషన్‌ (జీసీటీఏ) ఆధ్వర్యంలో బోనాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు దాదాపు 150కిపైగా తెలుగువారు హాజరయ్యారు. మహిళలు బోనాలు చేతపట్టుకుని పోతరాజుల విన్యాసాలతో ఈ బోనాలను ఉత్సాహంగా జరిపించారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన బోనాలు నెత్తిన పెట్టుకుని మహిళలు ఊరేగింపుగా వస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పిల్లలు, పెద్దలు అందరూ కలిసి నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు.
కార్యక్రమ సమన్వయ కమిటీ సభ్యులుగా వ్యవహరించిన  ప్రభాకర్‌ రెడ్డి కేసరి, లవకర్‌ రెడ్డి బోరెడ్డి, సంతోష్‌ రెడ్డి కేతిరి, నరసింహ నాగులవంచకు అసోసియేషన్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు సహకరించిన చాట్లవారి కుటుంబం, మడిశెట్టివారి కుటుంబం, సందీప్‌ కామిశెట్టి, నరసింహ నాగుల, రఘు మర్లను సంఘం సభ్యులు అభినందించారు.

వార్తలు / కథనాలు

మరిన్ని