close
గ్రీన్‌కార్డులు మరింత కష్టం

చట్టబద్ధ వలసదారులు ప్రభుత్వసాయం పొందితే కార్డు రానట్లే!

వాషింగ్టన్‌: గ్రీన్‌కార్డుల జారీలో ట్రంప్‌ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. అమెరికా తన పౌరుల కోసం అందించే వైద్యసాయం, ఆహార కూపన్లు, ఇంటి వోచర్లు లేదా మరేదైనా ప్రభుత్వసాయాన్ని చట్టబద్ధమైన వలసదారులు పొందుతుంటే వారికి వీటిని నిరాకరించాలని కొత్త నిబంధన తెచ్చింది. ఇప్పటికే గ్రీన్‌కార్డులు పొందాలనుకునే వారు తాము అమెరికాకు భారం కాబోమని నిరూపించుకోవాలి. ఏయే సేవలు పొందే వారికి ప్రభుత్వ ఆహార కూపన్లు తదితరాలను ఇవ్వరో కొత్త నిబంధనల్లో విస్తృతంగా వివరించారు. కొత్త నిబంధనలు అక్టోబరు మధ్య నుంచి అమలులోకి వస్తాయి. వీటి వల్ల వలసదారులు సాయం అడగడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

వార్తలు / కథనాలు

మరిన్ని