close
గల్ఫ్‌ ప్రవాసులకు మోదీ సభలో పాల్గొనే అవకాశం

దిల్లీ:  మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బహ్రెయిన్‌ నేషనల్‌ స్టేడియంలో ఈ నెల 24న భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు గల్ఫ్‌లోని ప్రవాస భారతీయులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. సౌదీలోని భారతీయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇందుకోసం అక్కడి భారత రాయబార కార్యాలయం రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తోంది. ముందుగా తమ పేరు నమోదు చేసుకునేవారికి అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ నెల 22న మూడు దేశాల పర్యటనకు మోదీ బయల్దేరి వెళ్లనున్నారు. తొలుత ఫ్రాన్స్‌కు వెళ్లి అక్కడి నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. 

రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు క్లిక్‌ చేయండి..

వార్తలు / కథనాలు

మరిన్ని