close
చైనాలో 45 కళాశాలల్లోనే ఆంగ్లంలో ఎంబీబీఎస్‌

బీజింగ్‌: విదేశీ విద్యార్థులకు ఆంగ్లంలో ఎంబీబీఎస్‌ విద్యను అందించే అవకాశాన్ని 45 వైద్య కళాశాలలకే పరిమితం చేయాలని చైనా నిర్ణయించింది. ఈ కళాశాలలు కాకుండా మరేవీ విదేశీ విద్యార్థుల్ని ఆంగ్ల మాధ్యమంలో ఎంబీబీఎస్‌ కోసం చేర్చుకోకూడదని చైనా విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ద్విభాషా సూత్రం కింద కాకుండా కేవలం చైనా అధికారిక భాషలోనే మిగిలిన కళాశాలలు వైద్య విద్యను బోధించాలని స్పష్టం చేసింది.

చైనాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు  : 5 లక్షలు
వీరిలో భారతీయులు                   : 23,000
భారతీయుల్లో ఎంబీబీఎస్‌ కోసం వచ్చినవారు : 21,000

ఇకపై అమెరికాలోనూ జేఈఈ ప్రవేశ పరీక్షలు

అక్కడి విద్యార్థులను ఆకర్షించేందుకే

దిల్లీ: ఐఐటీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షల విషయంలో కీలక అడుగు పడింది. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఇక అమెరికాలోనూ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. మనదేశంలో ఉన్న ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లోకి అమెరికా నుంచి భారత్‌కు  విద్యార్థులను రప్పించడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షల్లో అడిస్‌ అబాబా(ఇథియోపియా), కొలంబో(శ్రీలంక), ఢాకా(బంగ్లాదేశ్‌), దుబాయ్‌(యూఏఈ), ఖాట్మండు(నేపాల్‌), సింగపూర్‌ వంటి ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు అమెరికాలో ప్రవేశ పరీక్ష నిర్వహించింది లేదు. దీనిపై ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ..

‘అమెరికా-భారత్‌కు టెక్నాలజీ పరంగా ఎంతో అనుబంధం ఉంది. అక్కడ కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఎన్నో అభ్యర్థనలు వస్తున్నాయి. అందుకే 2020లో జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రవేశ పరీక్షలను శాన్‌ ఫ్రాన్సిస్కోలో కూడా నిర్వహించనున్నాం. ఈ పరీక్ష మేనెలలో జరిగే అవకాశం ఉంటుంది.’ అని తెలిపారు.

ఇదే విషయాన్ని ఐఐటీ దిల్లీ డైరెక్టర్‌ రామ్‌గోపాల రావు ముందు ప్రస్తావించగా... ‘శాన్‌ ఫ్రాన్సిస్కోలోని బే ప్రాంతంలో భారతీయులు ఎక్కువమంది ఉన్నారు. భారతీయ విద్యాసంస్థలకు చెందిన కొందరు ఫ్రొఫెసర్లు అక్కడ పర్యటించినప్పుడు..పూర్వ విద్యార్థి ఒకరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. తమ పిల్లల్ని ఇండియన్‌ ఐటీ చదివించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాబట్టే శాన్‌ఫ్రాన్సిస్కోను కూడా ఈ సారి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. వీరిని చూసి అమెరికా విద్యార్థులు కూడా ఇక్కడి విద్యాసంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది’ అని గోపాల రావు తెలిపారు.

కోరుకుంటే...కోర్సుకో దేశం!

విదేశీ విద్య

పరిశోధనల కోసం అనువైన పరిస్థితులు, ఉద్యోగాలకు ఉన్న అవకాశాలు, ఎక్కువ మంది ఏయే దేశాలకు ఎందుకు వెళుతున్నారు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాలు కొన్ని కోర్సులకు ప్రసిద్ధి చెందినట్లు గమనించవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ సమాచారం ఆధారంగా  ఏ కోర్సుకి ఏ దేశానికి వెళ్లాలి అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో చదువుకునే మన విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువమంది పీజీ కోర్సుల కోసం పరాయి దేశాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యమైన బోధనను అందించే యూనివర్సిటీల సమాచారం కోసం అభ్యర్థులు అన్వేషిస్తున్నారు. అగ్రగామి అమెరికా మొదలు చిన్న దేశమైన సింగపూర్‌ వరకూ ఎన్నో రకాల కోర్సులను అందిస్తున్నాయి. ఒక్కోదేశం ఒక్కో తరహా కోర్సులకు ప్రసిద్ధి చెందాయి. ఎక్కడ ఏ కోర్సులు బాగుంటాయో తెలుసుకొని అడుగేస్తే గరిష్ఠ ప్రయోజనం ఉంటుంది.


స్టెమ్‌, మేనేజ్‌మెంట్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ : అమెరికా

సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌... వీటిని స్టెమ్‌ కోర్సులంటారు. యూఎస్‌ వెళ్లే  భారతీయ విద్యార్థుల్లో 80 శాతం ఈ కోర్సుల్లోనే చేరుతున్నారు. ఇంజినీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌...ఒక్కో కోర్సులోనూ ఏటా రెండేసి లక్షల మంది చొప్పున విదేశీ విద్యార్థులను అమెరికా ఆకర్షిస్తోంది. ఫీజు అధిక మొత్తంలో ఉన్నప్పటికీ విదేశీయులు అమెరికాలో చదవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఉన్నత విద్యా ప్రమాణాలతోపాటు మంచి కెరియర్‌ సొంతం కావడమే దీనికి కారణం. అమెరికాలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో 20 శాతం విదేశీయులే. ఎఫ్‌టీ సహా, పలు సర్వేల ప్రకారం టాప్‌ బిజినెస్‌ స్కూళ్లలో సింహభాగం అమెరికాలోనే ఉన్నాయి. అలాగే ఇంజినీరింగ్‌లోనూ సత్తా చాటుతోంది. సోషల్‌ సైన్సెస్‌ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులూ యూఎస్‌కే తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కోర్సుల్లో పరిశోధనకు అవకాశాలు లభించడం, సులువుగా ఉద్యోగాలు దొరకడం కారణాలు.
ఇంటర్నెట్‌, డిజిటల్‌ ప్రభావంతో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలను మించి ఆన్‌లైన్‌ మీడియా పుంజుకుంటోంది. దీంతో న్యూ మీడియా కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇందులోనూ అగ్రరాజ్యం అమెరికాదే పైచేయి.ప్రపంచంలో మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులకు న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ ప్రసిద్ధి. దీని తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ-బెర్క్‌లీ, టెక్సాస్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్‌ పేరున్న సంస్థలు. అధిక సంఖ్యలో పులిట్జర్‌ అవార్డులు అందుకున్నది అమెరికావాళ్లే.


ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ : అమెరికా, యూకే

ఆంగ్లం, సాహిత్యం, చరిత్ర, తత్త్వశాస్త్రం...తదితర కోర్సులకు అమెరికా, యూకేలు పేరుపొందాయి. ప్రపంచ అత్యుత్తమ సంస్థల జాబితాలో స్థానం పొందిన విశ్వవిద్యాలయాల్లో అధిక శాతం ఈ రెండు దేశాల్లోనివే. లైఫ్‌ సైన్సెస్‌లోనూ యూఎస్‌, యూకేలే అగ్రగాములు. పురాతన ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విఖ్యాత హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌ అన్ని కోర్సుల్లోనూ తిరుగులేని సంస్థలు. ఇవే కాకుండా వివిధ విశ్వవిద్యాలయాలు మేటి విద్యను అందిస్తున్నాయి.


సివిల్‌, ఆర్కిటెక్చర్‌ : దుబాయ్‌

దుబాయ్‌ పేరెత్తగానే గుర్తొచ్చేది ఆకాశహర్మ్యాలు, ఆకర్షణీయ డిజైన్‌లే. ఆర్కిటెక్చర్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులు తొలి ప్రాధాన్యం దుబాయ్‌కి ఇవ్వడం సముచితం. ఇక్కడి బుర్జ్‌ ఖలీఫా, మరీనా 101, ది పామ్‌..లాంటి నిర్మాణాలు ప్రపంచంలోనే విశిష్టమైనవిగా పేరొందాయి. విశ్వవిఖ్యాత నిర్మాణ సంస్థల కార్యాలయాలన్నీ దుబాయ్‌లో నెలకొన్నాయి. అయిదారేళ్ల పని అనుభవం ఉన్న సీనియర్‌ ఆర్కిటెక్చర్లు ఏటా సగటున కోటి రూపాయల వేతనం పొందుతున్నారు. ప్రతి కట్టడానికీ ఆర్కిటెక్చర్లతోపాటు సివిల్‌ ఇంజినీర్ల సేవలూ కీలకం. అందువల్లే సివిల్‌కు దుబాయ్‌లో గిరాకీ ఉంది. ఇక్కడి సివిల్‌ ఇంజినీర్లు కెరియర్‌ ఆరంభంలో ఏడాదికి రూ.20 లక్షలు ఆర్జిస్తున్నారు. ప్రపంచంలో ఆర్కిటెక్చర్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యలో దుబాయ్‌ తర్వాతే ఏ దేశమైనా అనే స్థాయికి చేరుకుంది. భారత్‌కు చెందిన అమిటీ, మణిపాల్‌ యూనివర్సిటీలు ఇక్కడ సివిల్‌/ ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఈ రెండూ దుబాయ్‌లో మేటి కళాశాలలుగా పేరొందాయి. వీటితోపాటు అమెరికన్‌ యూనివర్సిటీ, హెరోట్‌ వాట్‌ యూనివర్సిటీ సివిల్‌కు ప్రాధాన్యమున్న విద్యాసంస్థలు. 


ఆటోమొబైల్‌, మెకానికల్‌ : జర్మనీ


ఆడి, బీఎండబ్ల్యు, బెంజ్‌, పోర్షే, ఫోక్స్‌ వ్యాగన్‌...ఇలా ప్రముఖ కార్ల తయారీ కంపెనీలకు పుట్టినిల్లు జర్మనీ. ఆటోమొబైల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యలో ఈ దేశం తర్వాతే ఏవైనా. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు బ్రాంచీల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులు జర్మనీ బాట పడుతున్నారు. మేటి చదువులతోపాటు ఉన్నత అవకాశాలూ సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడ మోటారు వాహనాలతోపాటు భారీ యంత్రాలు సైతం ఎక్కువగా తయారవుతున్నాయి. జర్మనీలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. నాణ్యమైన జీవనప్రమాణాలు, తక్కువ ఫీజు వీరిని ఆకర్షిస్తున్నాయి. బయో టెక్నాలజీ, స్టెమ్‌ కోర్సుల్లోనూ ఎక్కువమంది చేరుతున్నారు. ఇక్కడ పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తారు. వివిధ రంగాల్లో వందకుపైగా నోబెల్‌ విజేతలను ఈ దేశం అందించింది. ఈ దేశంలో మూనిచ్‌ టెక్నికల్‌ విశ్వవిద్యాలయం ప్రసిద్ధ సంస్థ. ఏటా పదివేల మందికి పైగా భారతీయ విద్యార్థులు జర్మనీ వెళ్తున్నారు.


విదేశీ విద్యార్థుల ప్రాధాన్యం ఇలా..

ఏటా పది లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు యూఎస్‌లో చదువులకు వెళ్తున్నారు. ఈ విద్యార్థుల్లో చైనాది ప్రథమ స్థానం కాగా భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఎక్కువమంది ఇంజినీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కోర్సుల్లో చేరుతున్నారు.

బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులకు కెనడా ప్రసిద్ధి. చైనా, భారత్‌ల నుంచి ఎక్కువమంది చేరుతున్నారు.ఫ్యాషన్‌ డిజైనింగ్‌, యానిమేషన్‌, గేమింగ్‌, జర్నలిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఈ దేశంలో ప్రాధాన్యమున్న కోర్సులు..

దాదాపు 3 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో చైనా, భారత్‌లు ఉన్నాయి. ఎక్కువమంది బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, హాస్పిటాలిటీ, పర్సనల్‌ సర్వీసెస్‌, కామర్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సులకు ఆస్ట్రేలియాకు ప్రాధాన్యమిస్తున్నారు.
న్యూజిలాండ్‌ చదువులకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథ్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ఎక్కువమంది చేరుతున్నారు.

వైద్య విద్య నిమిత్తం ఎక్కువ మంది భారతీయులు చైనా వెళ్తున్నారు. అన్ని కోర్సుల్లో కలుపుకుని ఏటా పదిహేను వేల మందికి పైగా భారతీయులు చైనాలో చేరుతున్నారు. హ్యుమానిటీస్‌, బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, సోషల్‌ సైన్సెస్‌ కోర్సులకు ఈ దేశం ప్రసిద్ధి. ఏటా 4 లక్షల మంది విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది.
అయిదు లక్షలమందికి పైగా విద్యార్థులు యూకే చదువులకు వెళ్తున్నారు. వీరిలో ప్రథమ స్థానం చైనా. తర్వాత అమెరికా. భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఫైన్‌ అండ్‌ అప్లైడ్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు.

సింగపూర్‌లో లక్ష మందికి పైగా విదేశీ విద్యార్థులు చేరుతున్నారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, లా కోర్సులకు ఈ దేశం ప్రసిద్ధి. ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌, హాస్పిటాలిటీ, మాస్‌ కమ్యూనికేషన్‌, లాజిస్టిక్స్‌, ఏవియేషన్‌లు సైతం ఈ దేశంలో పేరున్న కోర్సులు.
ఇటీవలి కాలంలో కొంతమంది ఐర్లాండ్‌ వెళుతున్నారు. ఇక్కడి ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌, డేటా సైన్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌, ఫిజిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో మన వాళ్లతోపాటు అమెరికా, చైనా, ఫ్రాన్స్‌ల విద్యార్థులూ చేరుతున్నారు.

 

మరికొన్ని..
• లా, ఆర్ట్‌, డిజైన్‌ కోర్సులకు యూకే ప్రసిద్ధి చెందింది.
•  మెడిసిన్‌, డెంటిస్ట్రీ కోర్సుల కోసం రష్యాను పరిశీలించవచ్చు. ఈ దేశం హ్యుమానిటీస్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌ కోర్సులకు పేరుపొందింది.
•  పొలిటికల్‌ సైన్స్‌ కోర్సుల్లో ఫ్రాన్స్‌ అగ్రగామి.
•  పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ అండ్‌ హెల్త్‌ కోర్సులకు నెదర్లాండ్స్‌ ప్రసిద్ధి.
•  అప్లయిడ్‌ సైన్సెస్‌, ట్రెడిషనల్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ కోర్సుల కోసం జపాన్‌ను ఎంచుకోవచ్చు.
•  హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ కోర్సులకు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్‌, మలేసియా చెప్పుకోదగ్గవి.

బ్రిటన్‌ రండి బాబూ..!

పెద్ద చదువులకు చేయూతనిస్తాం
మాస్టర్స్‌ డిగ్రీ చేసే వారికి 30 వేల పౌండ్ల ఉపకార వేతనం

‘ఈనాడు’తో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌యువత ఎంచుకున్న రంగాల్లో అంతర్జాతీయంగా అవగాహన పొందటం ద్వారా మెరుగ్గా రాణించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ తెలిపారు. వారికి నచ్చిన కోర్సులో మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు స్కాలర్‌షిప్స్‌, వృత్తి నిపుణులకు ఫెలోషిప్స్‌ అందిస్తున్నట్టు వివరించారు. ‘2020-21 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థులు, వృత్తి నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఎక్కువ మంది ఎంపికయ్యే అవకాశం ఉన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించటం లేదు’ అని హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ చెప్పారు. శుక్రవారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ స్కాలర్‌షిప్స్‌ పొందడం ఎలా?
పట్టభద్రులై, రెండేళ్లపాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు స్కాలర్‌షిప్స్‌పై మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు అర్హులు. వృత్తి నిపుణులు ఆయా రంగాల్లో మరింతగా రాణించేందుకు స్వల్పకాలిక కోర్సుల కోసం ఫెలోషిప్స్‌ ఇస్తున్నాం. భవిష్యత్తు నాయకులను తయారు చేయాలన్నదే లక్ష్యం. 1983 నుంచి ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ప్రతి సంవత్సరం సుమారు 1,800 మందికి స్కాలర్‌షిప్స్‌ ఇస్తున్నాం. భారతీయ విద్యార్థుల కోసం 110 కేటాయించాం. సమగ్ర సమాచారం కోసం ‌www.chevening.org లేదాwww. chevening.org/india. www. chevening.org/scholarships పరిశీలించవచ్చు.

ఏ రాష్ట్రాల నుంచి ఎంపిక ఎక్కువగా ఉంది?
బెంగళూరు, దిల్లీ, కోల్‌కత, ముంబయి నగరాల నుంచి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎంపికవుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు అవకాశాలు అధికంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చదివే వారు, ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందేవారు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఉంటున్నారు. దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మాత్రం నామమాత్రంగానే ఉంది. ఈ స్కాలర్‌షిప్స్‌, ఫెలోషిప్స్‌పై ఇటు విద్యార్థులకు అటు తల్లిదండ్రులకు అవగాహన లేకపోవటమే కారణం.

దరఖాస్తు గడువు ఎప్పటి వరకు ఉంది? ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు?
బ్రిటన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారందరూ స్కాలర్‌షిప్స్‌ పొందేందుకు అర్హులు. వివిధ దశల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తాం. మాస్టర్స్‌ పూర్తి చేసే ఏడాది కాలానికి అన్ని ఖర్చులను బ్రిటిష్‌ ప్రభుత్వమే భరిస్తుంది. ఫీజు, నివాస ఖర్చులు ఇందులో ఉంటాయి. ఒక్కో విద్యార్థిపై ఏడాది కాలానికి 30 వేల పౌండ్లను వెచ్చిస్తాం. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.26 లక్షలకు పైగా ఉంటుంది. 12 వేల రకాల మాస్టర్స్‌ కోర్సుల్లో ఎందులోనైనా వారు చేరవచ్చు. ఇన్నోవేషన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ నుంచి ఆరోగ్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, లైఫ్‌ సైన్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇలా చాలా కోర్సులున్నాయి. కోర్సు ఎంపిక స్వేచ్ఛ విద్యార్థులదే. బ్రిటన్‌లోని 150 విశ్వవిద్యాలయాల్లో ఎక్కడైనా చేరవచ్చు. ఈ ఏడాది నవంబరు అయిదో తేదీతో దరఖాస్తు చేసుకునే గడువు ముగుస్తుంది. ఫిబ్రవరిలోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తాం. ఫెలోషిప్స్‌ గడువు ఒక వారం నుంచి మూడు నెలల వరకు ఉంటుంది.

భారత్‌తో వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?
బాగున్నాయి. భారీగానే ఎగుమతులు, దిగుమతులు సాగుతున్నాయి. తమ దేశానికి చెందిన కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. భారతదేశంలో కంపెనీలు పెట్టాలంటే బ్రిటిష్‌ పారిశ్రామికవేత్తలు బెంగళూరు, ముంబయి, దిల్లీలవైపే ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం హైదరాబాద్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిశ్రమలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎక్కువ మందిని భాగస్వాములను చేసేందుకు మీ ప్రణాళిక ఏమిటి?
పత్రికలు, సామాజిక మాధ్యమాలే ఆధారం. వాటి ద్వారా ఎక్కువ మంది తల్లిదండ్రులు, విద్యార్థులను చేరేందుకు ప్రయత్నిస్తున్నాం. దరఖాస్తుదారులకు ఉపకరించేలా ఆన్‌లైన్‌లో ప్రశ్న-జవాబు విధానం అమలుచేయనున్నాం. గతంలో లబ్ధి పొందిన వారి ద్వారా సమావేశాలు నిర్వహిస్తాం. స్కాలర్‌షిప్పులకు కోల్‌కత, బెంగళూరు, ముంబయి, దిల్లీలలో ఇంటర్వ్యూలు చేస్తాం. ఫెలోషిప్స్‌కు మాత్రం దిల్లీలోనే నిర్వహిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చెప్పుకోదగిన సంఖ్యలో దరఖాస్తులు వస్తే హైదరాబాద్‌లో కూడా ఇంటర్వ్యూలకు ప్రణాళిక రూపొందిస్తాం.

ఏ దేశమేగాలి..ఏం చదవాలి?

విదేశీవిద్య

విదేశాలకు వెళ్లి చదువుకోవడం ఇప్పుడు కల కాదు... కామన్‌ అయిపోతోంది. అయితే ఏ దేశానికి వెళ్లాలి అనేది మొదట ఎదురయ్యే ప్రశ్న. అందరూ అమెరికా అంటున్నారు.. యూకే ఓకే.. కాకుంటే కెనడా.. ఆలోచిస్తే ఆస్ట్రేలియా.. పోనీ జర్మనీ.. కొత్తగా న్యూజిలాండ్‌.. సరాసరి సింగపూర్‌.. ఇలా ఎక్కడికైనా మనవాళ్లు వెళ్లిపోతున్నారు. ఈ సంఖ్య ఏటా పెరిగిపోతోంది. ఇప్పుడు వెళ్లాలనుకునే వాళ్లు ముందుగా ఆయా దేశాల ప్రత్యేకతలపై స్థూల అవగాహన తెచ్చుకోవాలి. అడ్మిషన్ల సమయానికి ఒక సంవత్సరం లేదా తొమ్మిది నెలల ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి.

ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. 2000 సంవత్సరంలో కేవలం పది లక్షల మందే విదేశాలకు వెళ్లి చదివేవారు. 2007 నాటికి ఆ సంఖ్య రెట్టింపై 2015 నాటికి అరకోటి దాటింది. 2020కి ఇది డెబ్భై లక్షలకు చేరుతుందని అంచనా. విదేశాల్లో చదువుతోన్న విద్యార్థుల్లో చైనా ముందుండగా, తర్వాతి స్థానంలో భారత్‌ దూసుకుపోతోంది. వృద్ధి విషయంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. మనదేశం ఏటా 10 శాతం పెరుగుదల కనబరుస్తుండగా, చైనాలో ఇది 8 శాతంగా నమోదవుతోంది. ఏటా 3.5 లక్షలకుపైగా భారతీయ విద్యార్థులు చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో దాదాపు 85 శాతం మంది యూఎస్‌, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లోని విద్యా సంస్థల్లో చేరుతున్నారు. సగం మంది అమెరికాలో కాలుమోపుతున్నారు. వీరిలో 80 శాతం మంది స్టెమ్‌ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. విదేశీ విద్య అభ్యసించే భారతీయుల్లో 10 శాతం అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో, 75 శాతం మాస్టర్స్‌ డిగ్రీలోనూ చేరుతున్నారు.


ఓపీటీ ఒక వరం
అమెరికా

ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 కంపెనీల్లో కనీసం సగం సంస్థలకు ప్రధాన కార్యాలయాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రపంచ గమనాన్ని మార్చేసిన స్టార్టప్‌లకు పుట్టినిల్లు యూఎస్‌. టెక్నాలజీ, సైంటిఫిక్‌ రిసెర్చ్‌, మ్యూజిక్‌, మూవీస్‌, కాలేజీల ర్యాంకులు...ఏవైనాసరే టాప్‌ స్థానంలో అమెరికా ఉంటుంది. అందువల్లే అక్కడి పేరొందిన సంస్థల్లో ట్యూషన్‌ ఫీజు ఏడాదికి అక్షరాలా రూ. అరకోటి. అయితే బడ్జెట్‌ ప్రకారం ఎంచుకోవడానికి ఆ దేశంలో నాలుగు వేల విద్యాసంస్థలు ఉన్నాయి. ఏఆర్‌డబ్ల్యు, క్యూఎస్‌, టైమ్స్‌ సంస్థలు ప్రకటిస్తోన్న ప్రపంచ టాప్‌- 100 విశ్వవిద్యాలయాల జాబితాల్లో కనీసం 40 నుంచి 50 వరకు ఈ ఒక్క దేశం నుంచే నమోదవుతున్నాయి. అందువల్ల మెరిట్‌ విద్యార్థుల మొదటి ఎంపిక యూఎస్‌గానే ఉంటోంది. ప్రపంచ ప్రసిద్ధ స్టాన్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నవారిలో 5 శాతం మందికే అవకాశం లభిస్తుంది.

* స్టెమ్‌ కోర్సులకు మూడేళ్లు, మిగిలిన కోర్సులకు ఏడాదిపాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ఉంటుంది.
* మూడు సీజన్లలో ప్రవేశాలు. ప్రధానమైన ఫాల్‌ సీజన్‌ సెప్టెంబరులో మొదలవుతుంది. 


నాణ్యమైన జీవనం
కెనడా

యూఎస్‌ తర్వాత ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం కెనడా. ట్యూషన్‌, వసతి కోసం యూఎస్‌లో వెచ్చించే మొత్తంతో చూసుకుంటే దాదాపు 50-60 శాతంతో కోర్సు పూర్తవుతుంది. ప్రపంచంలో నాణ్యమైన జీవన ప్రమాణాలున్న దేశాల్లో కెనడానే ముందుంటోంది. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పటికీ విదేశీ విద్యార్థులు చదువుకోవడానికి అనుకూల పరిస్థితులు ఇక్కడ ఎక్కువ. ఈ దేశ జనాభాలో దాదాపు 4 శాతం మంది భారతీయులే ఉన్నారు. అలాగే ఇక్కడ ఎక్కువమంది మాట్లాడే భాషల్లో పంజాబీది నాలుగో స్థానం. ఇంజినీరింగ్‌, ఐటీ, బయోసైన్సెస్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా, కొంచెం సులువుగా లభిస్తాయి. ఇక్కడ రెండేళ్ల పని అనుభవంతో శాశ్వత నివాస యోగ్యతకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత పౌరసత్వానికి ప్రయత్నించుకోవచ్చు. వీసా ప్రాసెసింగ్‌ వ్యవధిని కెనడా 60 నుంచి 45 రోజులకు తగ్గించింది. ఈ దేశంలో ఉద్యోగావకాశాలూ, ఎంచుకోవడానికి విద్యా సంస్థలూ ఎక్కువే. భిన్న సంస్కృతులు దర్శనమిస్తాయి. ఇక్కడి విదేశీ విద్యార్థుల్లో దాదాపు 28 శాతం మంది చైనీయులు. భారతీయుల వాటా 25 శాతం. ప్రవేశాలు ఎక్కువగా సెప్టెంబరు, జనవరిలో ఉంటాయి.

* ఈ దేశ జనాభాలో దాదాపు 4 శాతం మంది భారతీయులే ఉన్నారు.
* ప్రవేశాలు ఎక్కువగా సెప్టెంబరు, జనవరిలో ఉంటాయి.తక్కువ ఖర్చుతో వసతి
జర్మనీ

ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. విదేశీ విద్యార్థులకు ఉచితంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అందించడం ఈ దేశం ప్రత్యేకత. తక్కువ ఖర్చుతో వసతి పొందవచ్చు. స్టెమ్‌, ఫైనాన్స్‌ కోర్సులకు ప్రసిద్ధి. ఏడాదిలో 120 రోజులు పనిచేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. పీజీ స్థాయిలో వెయ్యికిపైగా, యూజీలో 150 కోర్సులను ఆంగ్లంలో చదువుకోవచ్చు. అయితే ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా ఉండడానికి జర్మన్‌ భాష నేర్చుకోవడం మంచిది. ఆ భాషతో పరిచయం ఉంటేనే ప్రవేశం లభిస్తుంది. ఇందుకోసం పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌, ఐటీ, మెడిసిన్‌, నర్సింగ్‌, సైంటిఫిక్‌ రిసెర్చ్‌లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఉద్యోగంలో మూడేళ్లు కొనసాగిన తర్వాత శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సమ్మర్‌ కోర్సులు ఏప్రిల్‌లో, వింటర్‌ అడ్మిషన్లు అక్టోబరులో జరుగుతాయి.

* స్టెమ్‌, ఫైనాన్స్‌ కోర్సులకు ప్రఖ్యాతి.
*విదేశీ విద్యార్థులకు ఉచితంగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అందిస్తారు.ఏడాదిలో పీజీ
యూకే

సుప్రసిద్ధ ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాలు, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌... ఈ దేశానికి చెందిన ప్రపంచస్థాయి సంస్థలు. ఇక్కడ సాధారణ చదువులతోపాటు నాణ్యమైన వైద్యవిద్య విదేశీ విద్యార్థులకు అందుతుంది. ఇక్కడ ఏడాది వ్యవధితో పూర్తయ్యే పీజీ కోర్సులున్నాయి. వీటిని పరిశ్రమలు గుర్తించాయి. అయితే వీటిని పూర్తిచేసుకున్నవారికి భారత్‌లో ఉపాధి పొందడానికి ప్రతికూలతలు ఉన్నాయి. విదేశీ విద్యార్థులకు కామన్‌వెల్త్‌, గ్రేట్‌, రోడ్స్‌ స్కాలర్‌షిప్పులు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబరు/ అక్టోబరులో విద్యాసంవత్సరం మొదలవుతుంది. వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు.

* సెప్టెంబరు/ అక్టోబరులో విద్యాసంవత్సరం మొదలవుతుంది.
*వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు.


అక్కడే ఉద్యోగం మంచిది
ఆస్ట్రేలియా

ప్రపంచంలో నివాసానికి మెరుగైన మొదటి పది దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఇక్కడి వాతావరణం చాలా సహజంగా ఉంటుంది. ఒక చదరపు కిలోమీటరు పరిధిలో కేవలం ముగ్గురే ఉంటారు (భారత్‌లో ఇదే విస్తీర్ణంలో 455 మంది నివసిస్తున్నారు). క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. జీవన ప్రమాణాలు బాగుంటాయి. ఫీజులు దాదాపు యూఎస్‌లో మాదిరిగానే ఉంటాయి. ఈ దేశంలో చదువుకున్నవారు అక్కడే ఉద్యోగం పొందితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భారత్‌లో ఈ డిగ్రీలను ప్రత్యేకంగా పరిగణించరు. ఇక్కడి జనాభాలో 2 శాతం భారతీయులే. ఇమిగ్రేషన్‌ను ఈ దేశం ప్రోత్సహిస్తుంది. పీఆర్‌ (పర్మినెంట్‌ రెసిడెన్సీ) మాదిరి అయిదేళ్ల స్కిమ్మ్‌డ్‌ మైగ్రేషన్‌ ప్రోగ్రాం ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డాక్టర్లు, నర్సులు, ఫిజియోథెరపిస్టులు, వెబ్‌ డెవలపర్లు, సేల్స్‌ ప్రొఫెషన్లకు అనుకూలం. నాలుగేళ్ల పీఆర్‌ తర్వాత పౌరసత్వానికి ప్రయత్నించవచ్చు. ఎక్కువ కోర్సులు ఫిబ్రవరి, మార్చిల్లో మొదలవుతాయి.

* ఇమిగ్రేషన్‌ను ఈ దేశం ప్రోత్సహిస్తుంది.
* నాలుగేళ్ల పీఆర్‌ తర్వాత పౌరసత్వానికి అవకాశం.


వీసా సరళం
చైనా

చైనాలో ప్రసిద్ధ విద్యాసంస్థలు హాంకాంగ్‌లో నెలకొన్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి. బహుళజాతి సంస్థలకు చెందిన దాదాపు మూడోవంతు ప్రాంతీయ కేంద్ర కార్యాలయాలు చైనాలో ఉన్నాయి. మాండరిన్‌ వచ్చినవారు దూసుకుపోవచ్చు. హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులకు ప్రసిద్ధి. హాంకాంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్టెమ్‌, బిజినెస్‌, ఫైనాన్స్‌ కోర్సుల్లో పేరొందింది. వీసా ప్రక్రియ సరళంగా ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత ఏడాది ఉండవచ్చు. హాంకాంగ్‌లో ఏడేళ్లు ఉన్నవారు శాశ్వత నివాస యోగ్యత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

* మాండరిన్‌ భాష వస్తే ప్రయోజనకరం.
*హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులకు ప్రసిద్ధి.


అందుబాటులో ఫీజులు
న్యూజిలాండ్‌

ఇటీవలి కాలంలో న్యూజిలాండ్‌ వెళ్లి చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. హార్టికల్చర్‌, డెయిరీ టెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌, జియో థర్మల్‌ ఎనర్జీ అండ్‌ బయోటెక్నాలజీ కోర్సులు ఈ దేశంలో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారు. ప్రశాంతంగా చదువుకోవడానికి అనువైన పరిస్థితులు, శిక్షణలో అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌ వినియోగం, అందుబాటులో ఫీజు ఈ దేశం ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. కోర్సు అనంతరం మూడేళ్లు పోస్టు స్టడీ ఓపెన్‌ వర్కింగ్‌ వీసా సౌలభ్యం ఈ దేశంలో చదువుతోన్న విదేశీ విద్యార్థులకు కల్పించారు. జులై, ఫిబ్రవరిలో ప్రవేశాలు ఎక్కువగా ఉంటాయి.
* కోర్సు అనంతరం మూడేళ్లు పోస్టు స్టడీ ఓపెన్‌ వర్కింగ్‌ వీసా సౌలభ్యం
* జులై, ఫిబ్రవరిల్లో ప్రవేశాలు.


ఆరు నెలల్లో శాశ్వత నివాసం
సింగపూర్‌

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో సింగపూర్‌ రెండోది. దీనిద్వారా 188 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్‌/  వీసా ఆన్‌ అరైవల్‌ అవకాశం లభిస్తోంది. ఫైనాన్స్‌, టెక్నాలజీ హబ్‌లు ఎక్కువ. బహుళజాతి కంపెనీల్లో దాదాపు సగం సంస్థలకు ప్రాంతీయ కేంద్ర కార్యాలయాలు ఇక్కడే నెలకొల్పారు. నాన్యంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌, సింగపూర్‌ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీలు పేరున్న సంస్థలు. భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశస్థులు ఇక్కడ చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ విద్యలో వినూత్న కోర్సులకు సింగపూర్‌ ప్రసిద్ధి పొందింది. ప్రవేశాలు ఆగస్టు, జనవరిల్లో ఉంటాయి. ఉద్యోగం పొందినవారు 6 నెలల్లో శాశ్వత నివాసానికి అర్హత సాధిస్తారు. పీఆర్‌ వచ్చిన రెండేళ్ల తర్వాత పౌరసత్వం నిమిత్తం ప్రయత్నించవచ్చు.

* మేనేజ్‌మెంట్‌ విద్యలో వినూత్న కోర్సులకు సింగపూర్‌ ప్రసిద్ధి.
*ప్రవేశాలు ఆగస్టు, జనవరిల్లో.


విదేశీ విద్య కోసంఐర్లాండ్‌, యూఏఈ, జపాన్‌, దక్షిణ కొరియా, ఇటలీ, టర్కీ, ఫ్రాన్స్‌ దేశాలను సైతం మనవాళ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు

ముందుగా గ్రీన్‌కార్డు రద్దుచేసుకోండి!

హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికా యానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు.. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి.

నేను పనిచేస్తున్న సంస్థ నుంచి మారాలనుకుంటున్నాను. నా హెచ్‌1బి వీసా బదలాయింపునకు నూతన యాజమాన్యం పిటిషన్‌ దాఖలు చేయనుంది. అది ఆమోదం పొందేలోపు ప్రస్తుత హెచ్‌1బి వీసాపై భారత్‌కు వెళ్లవచ్చా?

- నవీన్‌ ఉన్నవ

మీ కోసం పిటిషన్‌ దాఖలుచేసిన ప్రస్తుత యాజమాన్యం వద్ద మీరు పనిచేయకపోయినా, మరేదైనా కారణంగా యాజమాన్యమే మారినా ప్రస్తుత హెచ్‌1బి వీసాపై మీరు అమెరికాలో ప్రవేశించలేరు. ఆమోదిత నూతన పిటిషన్‌ ఉంటే హెచ్‌1బి వీసా స్టాంప్‌ చేయించుకోవచ్చు. భారతదేశం నుంచి అమెరికా వచ్చేలోపు ఆ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు.

నా కోసం యాజమాన్యం జారీచేసిన ఎల్‌-1 బ్లాంకెట్‌ పిటిషన్‌ తిరస్కారానికి గురైంది. వ్యక్తిగత విభాగంలో ఎల్‌-1 పిటిషన్‌ దాఖలుచేసేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంది. ముందుకు వెళ్లమంటారా, ఓ ఏడాది వేచి ఉండమంటారా?

- ప్రకాష్‌ మహంతి

వ్యక్తిగత ఎల్‌-1 పిటిషన్‌ ఆమోదం పొందిన పక్షంలో మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఐ-797 పొందిన అనంతరం ఎప్పుడైనా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మా దంపతులకు గ్రీన్‌కార్డులు ఉన్నాయి. గత ఆరునెలల్లో మేం అమెరికా వెళ్లలేదు. కుటుంబ కార్యక్రమానికి హాజరు కావాలని అనుకుంటున్నాం. మా బి1/బి2 వీసాను పునరుద్ధరించుకోవచ్చా? దాని ప్రక్రియ ఏమిటి?- ప్రసాదరావు పమిడిపాల

నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా కోసం అర్హత పొందాలంటే- ముందు ఐ-407 దరఖాస్తును భర్తీచేసి కొత్త దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ కార్యాలయంలో గ్రీన్‌కార్డును సరెండర్‌ చేయాలి. దరఖాస్తుతో పాటు విధివిధానాలు ఏమిటి,  ఎలా దరఖాస్తు చేయాలనే సమాచారం కోసం www.uscis.gov/i-407 వెబ్‌సైట్‌ను పరిశీలించండి. ఆ ప్రక్రియ పూర్తిఅయ్యాక నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా(పర్యాటక) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నా ఎఫ్‌-1 వీసా దరఖాస్తును మూడు దఫాలు తిరస్కరించారు. అన్నిసార్లూ 214(బి) పత్రాన్ని ఇచ్చారు ఎలాంటి కారణాలూ చెప్పలేదు. విద్యార్థి వీసా పొందడం ఎలా?- కేవీ ప్రమోద్‌

చదువుకునేందుకు అమెరికా వెళుతున్నట్లు, కోర్సును పూర్తిచేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు, అందుకు ఫీజులు తదితర ఆర్థిక ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా చేసుకున్నట్లు స్పష్టంచేయాల్సి ఉంటుంది. చదువు పూర్తిచేసుకున్న తర్వాత మాతృదేశానికి తిరిగి వెళ్లిపోతానన్న విషయాన్ని ఎఫ్‌-1 వీసా దరఖాస్తుదారు ఇంటర్వ్యూ సమయంలో కాన్సులర్‌ అధికారికి ప్రస్ఫుటం చేయాలి. దరఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించి అభ్యర్థికి అన్ని అర్హతలూ ఉన్నాయా లేవా అన్నది ఇంటర్వ్యూ వేళ స్థూలంగా పరిశీలిస్తారు. గతంలో దరఖాస్తు తిరస్కరించిన అభ్యర్థుల విషయంలో.. తాజా ఇంటర్వ్యూలో ఏమైనా నూతన అంశాలు ఉన్నాయా, స్పష్టమైన వ్యత్యాసం ఉందా లేదా అని చూస్తారు.

 వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేయండి. 
 మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
 హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.

60 రోజుల ముందుగా ఓపీటీకి దరఖాస్తు!

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు.. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి.

వచ్చే రెండు నెలల్లో నా బి1/బి2 వీసా కాలం చెల్లిపోతుంది. పునరుద్ధరించుకునే విధానం ఏమిటి?

- ప్రవల్లికారెడ్డి ఎన్వీ

వీసా పునరుద్ధరణ ఎప్పుడైనా చేసుకోవచ్చు. వీసా గడువు తీరక ముందూ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హత పొందవచ్చు. మరింత సమాచారం కోసం www.ustraveldocs.com/in ను చూడండి. ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హత పొందకపోతే వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు  ‌www.ustraveldocs.com/in వెబ్‌సైట్‌ ద్వారా అపాయింటుమెంటు తీసుకోవాలి.

నేను చేస్తున్న మాస్టర్స్‌ డిగ్రీ 2019తో పూర్తి అవుతుంది. ఓపీటీకి దరఖాస్తు చేసుకోవచ్చా? ఓపీటీ సమయంలో సెలవులకు భారతదేశం వెళ్లవచ్చా?

- రవిచంద్రం సీవీ

విద్యా కార్యక్రమం పూర్తికావటానికి 60 రోజుల ముందుగా ఓపీటీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఇంకా నిర్ధారిత గడువులోపు ఉంటే ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ వ్యవహారాల అధికారి కార్యాలయాన్ని సంప్రదించండి. ఎఫ్‌-1 వీసాపై ఉన్న విద్యార్థుల ఓపీటీ స్థితి చెల్లుబాటులో ఉంటే సాధారణంగా అమెరికా వెలుపలి దేశాలకు వెళ్లవచ్చు. ప్రయాణానికి ముందు మీరువెళ్లే దేశంలో వీసా స్టాంపింగ్‌ చేయించుకునేందుకు లేదా అమెరికాలో ప్రవేశించేందుకు వీలుగా అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయా? లేవా? అన్నది నిర్ధారించుకునేందుకు మీ విశ్వవిద్యాలయంలోని అంతర్జాతీయ వ్యవహారాల అధికారిని సంప్రదించండి.

నా హెచ్‌1బీ పిటిషన్‌ జులైలో కాలం తీరనుంది. వీసాను పునరుద్ధరించుకునే ప్రక్రియలో ఉన్నాను. పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మా అమ్మకు సూచించవచ్చా?

- పద్మ నిమ్మగడ్డ

అమెరికా సందర్శించేందుకు మీ అమ్మగారు ఎప్పుడైనా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బి1/బి2 వీసా కోసం ఆమె దరఖాస్తు చేసుకోవాలి. బి1/బి2 వీసా ద్వారా అమెరికాలో ఉండేందుకు గరిష్ఠంగా ఆరు నెలలే అనుమతిస్తారని గుర్తుంచుకోవాలి. అది అమెరికా ప్రవేశ ప్రాంతంలోని అధికారులు నిర్ణయిస్తారు. మరింత సమాచారం కోసం www.ustraveldocs.com/in చూడండి.

నా భార్యకు గ్రీన్‌కార్డు ఉంది. నాలుగేళ్లుగా నేనూ అమెరికాలో ఉంటున్నాను. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు నాకు అర్హత ఎప్పుడు వస్తుంది?

- సీహెచ్‌ శ్రీమన్నారాయణ

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం గ్రీన్‌కార్డు అంశాల ప్రక్రియను నిర్వహించదు. గ్రీన్‌కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏయే ధ్రువపత్రాలు అవసరం? తదితర సమాచారం కోసం ‌www.uscis.gov వెబ్‌సైట్‌ను పరిశీలించండి.

* వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను supportn-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి.
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు.
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.netకు పంపండి.
హెచ్‌-4 వీసాదారులకు రక్షణగా అమెరికాలో బిల్లు

వాషింగ్టన్‌: హెచ్‌-4 వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి రక్షణగా కాలిఫోర్నియాకు చెందిన ఇద్దరు శాసనకర్తలు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. హెచ్‌-4 వీసా ఆధారంగా పని చేయడానికి అనుమతులు పొందుతున్నవారిపై నిషేధం విధించే ప్రక్రియను ప్రారంభించనున్నామని అక్కడి హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) ప్రకటించిన నేపథ్యంలో వారు ఈ బిల్లు ప్రవేశ పెట్టడం గమనార్హం. హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు ఇచ్చేదే హెచ్‌-4 వీసా. అయితే హెచ్-4వీసా పని అనుమతుల వల్ల అమెరికన్లు భారీగా నష్టపోతున్నారని.. నిబంధనలను మారుస్తామని ట్రంప్‌ సర్కార్‌ వాదిస్తూ వస్తోంది. తాజాగా అందుకనుగుణంగా నిబంధనలను త్వరలోనే మార్చనున్నామని డీహెచ్‌ఎస్‌ ప్రకటించడంతో.. అనేక మంది విదేశీయులు ఆందోళనకు గురవుతున్నారు. హెచ్-1బీ వీసా ద్వారా అమెరికాలో ఉపాధి పొందుతున్న వారిలో భారతీయులు గణనీయ సంఖ్యలో ఉండడం గమనార్హం. 

హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారి కుటుంబాల ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారి జీవితభాగస్వాములైన హెచ్‌-4వీసాదారులకు పని అనుమతి కల్పించిందని పలువురు శాసనకర్తలు గుర్తుచేశారు. హెచ్-4 ఎంప్లాయిమెంట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ పేరిట ఒబామా హయాంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా సిలికాన్‌ వ్యాలీ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఎంతో ఉపశమనం లభిస్తోందన్నారు. తాజా నిర్ణయంతో అత్యంత నైపుణ్యం గల అనేక మంది హెచ్‌-4వీసాదారులు ఉపాధి కోల్పోతారన్నారు. దీనివల్ల ప్రాంతీయంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా దాదాపు లక్ష మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు ట్రంప్‌ పాలక వర్గానికి అడ్డంకిగా మారాయి. దీంతో నిబంధనలు సడలించడానికి సిద్ధమయ్యారు.

ప్రయాణించకపోవడం పునరుద్ధరణకు సమస్యకాదు!

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి... 
అమెరికాలో పర్యటిద్దామనుకుంటున్నాను. పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి? వీసా ఆమోదం పొందిన తరవాత ఎంత వ్యవధిలో పర్యటించాలి? ఆ లోగా పర్యటించకపోతే వీసా పునరుద్ధరణ సమస్య అవుతుందా?

- పద్మారావు కేసాని

బీ1/బీ2 వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన సమాచారానికి, ఇంటర్వ్యూ అపాయింటుమెంటును షెడ్యూల్‌ చేసుకునేందుకు https://www.ustraveldocs.com/in  ను చూడండి. వీసా చెల్లుబాటయ్యే వ్యవధిలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వెళ్లేందుకు మాత్రమే మీ వీసా అనుమతి ఇస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. అమెరికాలోకి అనుమతించాలా? వద్దా? అనుమతిస్తే ఎంత కాలం? అన్నది ప్రవేశ ప్రాంతంలోని ఇమిగ్రేషన్‌ అధికారి నిర్ణయిస్తారు. అమెరికాలో పర్యటించనంత మాత్రాన వీసా పునరుద్ధరణకు ఎలాంటి సమస్య ఉండదు. ఇంటర్వ్యూ సమయంలో ఈ పర్యటనలకు సంబంధించిన పూర్వ సమాచారం గురించి ప్రశ్నించవచ్చు. 


త్వరలో బీటెక్‌ పూర్తి కానుంది. అమెరికాలో మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. వీసా విధానం ఏమిటి?

- కీర్తి ఎన్వీఎస్‌ఎస్‌

మీరు అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకోవటం మాకు సంతోషకరం. అమెరికాలో చదువుకోవాలనుకునే వారు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ వెబ్‌సైట్‌  https://educationusa.state.gov  తోపాటు యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌  https://usief.org.in  చూడాలన్నది మా సూచన. విద్యార్థి వీసాకు సంబంధించిన సమాచారం కోసం ‌www.ustraveldocs.com/in చూడండి. 


డిపెండెంట్‌ వీసాపై అమెరికాలో ఉంటున్నాను. దాన్ని విద్యార్థి వీసాగా మార్చుకోవచ్చా? ఆ విధానం ఏమిటి?

- ప్రసాద్‌బాబు ఎం

డిపెండెంట్‌ వీసాపై అమెరికాలో ఉన్నవారు మాస్టర్స్‌ డిగ్రీ చేయవచ్చు. విద్యార్థి వీసాకు దరఖాస్తు చేయాలనుకుంటే విశ్వవిద్యాలయం నుంచి మీరు ఐ-20ని పొందాల్సి ఉంటుంది. ఆ తరవాత మీ చదువును కొనసాగించవచ్చు. మరింత సమాచారం కోసం www.uscis.gov పరిశీలించండి. 


ప్రస్తుతం ఓపీటీపై అమెరికాలో ఉంటున్నాను. ఈ ఏడాది నవంబరు వరకు చెల్లుబాటు అవుతుంది. 2021 వరకు నా పాస్‌పోర్టు చెల్లుబాటులో ఉంటుంది. కుటుంబ కార్యక్రమం కోసం భారతదేశం వెళ్దామనుకుంటున్నాను. హైదరాబాద్‌లో వీసా స్టాంపింగ్‌ వేయించుకోవాలా? చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలతో ప్రయాణం చేయవచ్చా?

- ప్రదీప్‌కుమార్‌ దేవినేని

చెల్లుబాటయ్యే ఎఫ్‌-1 వీసాతోనే అమెరికా రావాల్సి ఉంటుంది. ఆ వీసాపై ఎస్‌ఈవీఎస్‌ గుర్తింపు, విశ్వవిద్యాలయం పేరు, ఐ-20, ఓపీటీ వివరాలు ఉంటే.. గడువు తీరేంత వరకు దాన్ని వినియోగించుకోవచ్చు. అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు ఆయా కళాశాలల్లోని సంబంధిత అధికారిని సంప్రదించి ప్రణాళికలను రూపొందించుకోండి.

వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను supportn-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి. 
మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు.  
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.
హెచ్‌-1బీ వీసాల్లో హెచ్‌సీఎల్‌కు 5వస్థానం

వాషింగ్టన్‌: అమెరికాలో హెచ్‌-1బీ వీసాల కోసం అత్యధిక విదేశీ ఉద్యోగుల ధ్రువీకరణ పత్రాలు(ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌)లు పొందిన 10 సంస్థల్లో  మన దేశం నుంచి హెచ్‌సీఎల్‌ ఒక్కటే నిలిచింది. అమెరికా అధికారిక గణాంకాల ప్రకారం ఈ హెచ్‌సీఎల్‌ కంపెనీ 5,085 సర్టిఫికేషన్‌లు అందుకుంది. 2019 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను విడుదల చేసిన సర్టిఫికేషన్లలో హెచ్‌సీఎల్‌కు 2.9శాతం దక్కాయి. ఈ జాబితాలో డెలాయిట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ మొత్తం 18,306 హెచ్‌ 1బీ స్పెషలిస్ట్‌ లేబర్‌ సర్టిఫికేట్‌లు పొందింది. 16,426 సర్టిఫికేషన్లతో యాపిల్‌ రెండో స్థానంలో ఉంది.

అమెరికాలోని కొన్ని ప్రత్యేక ఉద్యోగాలు, ఫ్యాషన్‌ మోడళ్లు, అత్యుత్తమ నైపుణ్యాలు, తెలివితేటలు ఉన్న విదేశీయులను సంస్థలు తాత్కాలికంగా వలసయేతర పద్ధతిలో నియమించుకొనేందుకు ఈ ధ్రువీకరణ విధానం ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో కంపెనీలు నిపుణులను నియామకం చేసుకొనేందుకు విదేశాంగశాఖ కార్మిక ధ్రువీకరణ పత్రాలు పొందుతాయి. అలా ఎక్కువ పత్రాలు పొందిన టాప్‌-10 సంస్థల జాబితాలో హెచ్‌సీఎల్‌(5,085 పత్రాలు) 5వ స్థానంలో నిలిచింది. ఇక ప్రొఫెషనల్‌ స్టాఫింగ్‌ ఏజెన్సీ కేఫోర్స్‌(10,292 పత్రాలు) మూడో స్థానంలో ఉండగా, అమెజాన్‌.కామ్‌(5,485 పత్రాలు) నాలుగో స్థానంలో ఉంది. ఇక ఫేస్‌బుక్‌(4,133 పత్రాలు) ఏడో స్థానంలో నిలిచింది. కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, క్వాల్‌కమ్‌ టెక్నాలజీస్‌, ఇంటెల్‌ కార్పొరేషన్‌, ఒరాకిల్‌ అమెరికా టాప్‌ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. గతేడాది హెచ్‌-1బీ తాత్కాలిక వీసాల మీద వచ్చి లబ్ధి పొందిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

హెచ్‌4 వీసాను పొందడమే సబబు

 హెచ్‌4 వీసాను పొందడమే సబబు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు... హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి... 
ఎఫ్‌-4 ఇమిగ్రెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాను. అది పెండింగులో ఉంది. అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేయాలనుకుంటున్నాను. ఎఫ్‌-1 వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చా?

- చంద్రమోహన్ 

విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్స్‌ ప్రోగ్రాం(ఎస్‌ఈవీపీ) ఆమోదించిన విశ్వవిద్యాలయం నుంచి పూర్తి స్థాయి కోర్సును చదవటమే ప్రధాన విధిగా ఉండాలి. విద్యార్థి వీసా విషయంలో కాన్సులర్‌ అధికారులు విద్యార్థులకు సంబంధించిన వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అడిగితే ఇమిగ్రెంట్‌ వీసాకు సంబంధించిన అంశాలను వివరించేందుకు సిద్ధంగా ఉండండి. ఎఫ్‌-1 విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన సమాచారం కోసం http://www.ustravelsdocs.com/in ను చూడండి.


2018 ఏప్రిల్‌ వరకు చెల్లుబాటయ్యే హెచ్‌1బి వీసా ఉంది. ఇటీవలే ఉద్యోగం మారాను. అత్యవసర పనులపై భారతదేశం వచ్చాను. ఇక్కడ ఉండగానే స్టాంపింగ్‌ కోసం హాజరుకావచ్చా?

 - కృష్ణకాంత్‌ తెన్నేటి 

మీ హెచ్‌1బి వీసా కాలం తీరకముందు మీరు భారతదేశం వెళ్లి ఉంటే అమెరికాలో ప్రవేశించేందుకు యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) నూతన యాజమాన్యానికి జారీ చేసిన నోటీసును ప్రవేశ ప్రాంతంలోని అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఆ పిటిషన్‌ యూఎస్‌సీఐఎస్‌ వద్ద పెండింగులో ఉంటే దరఖాస్తు రశీదును ప్రవేశ ప్రాంతంలో చూపించాల్సి ఉంటుంది. పిటిషన్‌ ఆమోదం పొందితే ఆ నోటీసును మీరు వెంటతెచ్చుకోవాలి. అమెరికాలోకి ప్రవేశించే ముందు అవసరమైతే మీరు కొత్త హెచ్‌1బి వీసా స్టాంపింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


2021 వరకు చెల్లుబాటయ్యే బి1/బి2 వీసా ఉంది. పాస్‌పోర్టు పోతే ఇటీవలే కొత్తది పొందాను. బి1/బి2 వీసా స్టాంపింగ్‌కు దరఖాస్తు చేద్దామనుకుంటున్నాను. ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హత లభిస్తుందా?

- అన్వరుల్‌ 

ఇంటర్వ్యూ మినహాయింపు పథకం(ఐడబ్ల్యూపీ)లో వ్యక్తిగతంగా తాజా వీసాను ఒరిజినల్‌ రూపంలో అందచేయని వారు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఐడబ్ల్యూపీ కోసం ప్రయత్నించినా మీరు వ్యక్తిగతంగా ఇంటర్వ్వూకు హజరుకావాలనే మేం సూచిస్తాం.


నా భర్త అమెరికాలో పని చేస్తున్నారు. నాకు డిపెండెంట్‌ వీసా ఉంది. నా భర్త నూతన కంపెనీలో చేరారు. హెచ్‌1బి వీసా బదలాయింపునకు నూతన యాజమాన్యం దరఖాస్తు చేసింది. అది పెండింగులో ఉంది. ఇలాంటి సమయంలోనేను డిపెండెంట్‌ వీసా స్టాంపింగ్‌ చేయించుకోవచ్చా? సాధ్యం కాని పక్షంలో పర్యాటక వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చా?

- మౌనారెడ్డి 

మీ భర్త కంపెనీ మారినప్పటికీ మీ వద్ద చెల్లుబాటయ్యే హెచ్‌4 వీసా ఉంటే అమెరికాలోకి ప్రవేశించేందుకు పోర్టులోని అధికారులను సంప్రదించవచ్చు. మీ హెచ్‌4 వీసా కాలం తీరితే కొత్త హెచ్‌4 వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ భర్త పిటిషన్‌ పెండింగులో ఉన్నంతకాలం మీ దరఖాస్తును పెండింగులో ఉంచుతారు. హెచ్‌1బీ వీసాపై ఉన్న మీభర్తతో కలిసి ఉండేందుకైతే మీరు పర్యాటక వీసాకు దరఖాస్తు చేయటం సబబు కాదు.హెచ్‌4 వీసాను పొందడమే సబబు. 


వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustravelsdocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి. 
మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsoulate.gov ను సంప్రదించవచ్చు. 
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.

స్వాగతిస్తున్నాయ్‌ సరికొత్త దేశాలు! 

స్వాగతిస్తున్నాయ్‌ సరికొత్త దేశాలు! 

విదేశాల్లో చదువుకోవటం అంటే అమెరికా, యు.కె., కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో మాత్రమేనా? ఇవి కాకుండా మరెన్నో గమ్యస్థానాలున్నాయి. ఆకర్షణీయమైన అవకాశాలతో అవి ఆహ్వానం పలుకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో విలువనిచ్చే డిగ్రీ కోసం విద్యార్థులు కూడా కొత్త దేశాల వైపు చూస్తున్నారు. నాణ్యమైన విద్యను ఇవ్వటమే కాకుండా, ఖర్చుపరంగా అందుబాటులో ఉండటం ఈ దేశాల్లోని విశ్వవిద్యాలయాల ప్రత్యేకత!

అమెరికాలాంటి దేశాల్లో వీసా నిబంధనలు కఠినమవటం మూలంగా విద్యార్థులు ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సివచ్చింది. అలా తెరమీదకు వచ్చినవే ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, జపాన్‌, వెస్ట్‌ఇండీస్‌లు. తక్కువ ఫీజుతో ప్రామాణిక విద్యను అందిస్తున్నాయీ దేశాలు. టెక్నాలజీ, ఐటీ, మెడిసిన్‌లలో స్పెషలైజేషన్‌ను బట్టి విభిన్న కోర్సులు ఇక్కడ లభ్యమవుతున్నాయి! 
 

 

ఫ్రాన్స్‌

న్నత విద్య, పరిశోధనల్లో శ్రేష్ఠతకు ఫ్రాన్స్‌ ప్రపంచవ్యాప్తంగా పేరుపొందింది. ఆర్కిటెక్చర్‌, పొలిటికల్‌ సైన్స్‌, లా, జర్నలిజం, డిజైన్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, టెక్నాలజీ, ఫ్యాషన్‌ మొదలైన విభిన్న సబ్జెక్టులను ఎంచుకోవచ్చు.

అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్య: ఫ్రాన్స్‌ విశ్వవిద్యాలయాల్లో యూజీ డిగ్రీ వ్యవధి మూడేళ్ళు. విద్యాసంవత్సరం సాధారణంగా సెప్టెంబరు మధ్య నుంచి తర్వాతి ఏడాది జూన్‌ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. కొన్ని విద్యాసంస్థలు ఏడాది పొడవునా ప్రవేశాలు కల్పిస్తాయి.

పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్య: ఇక్కడ పీజీ ప్రోగ్రాములు మూడు రకాలుగా ఉంటాయి. మాస్టర్స్‌ డిగ్రీ వ్యవధి 2 నుంచి 3 సంవత్సరాలుంటుంది. 1) టాట్‌ మాస్టర్స్‌ (ఎంఏ, ఎమ్మెస్సీ) 2) రిసెర్చ్‌ మాస్టర్స్‌ (ఎంఎ బై రిసెర్చ్‌) 3) డాక్టరేట్స్‌ అండ్‌ పీహెచ్‌డీస్‌.

ప్రవేశాలకు సంబంధించి ఫాల్‌ ఇన్‌టేక్‌ సెప్టెంబరులోనూ, స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌ జనవరిలోనూ ఉంటుంది.

ఖర్చు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖర్చు చాలా తక్కువ. ఇది కనిష్ఠంగా రూ. 14,030, గరిష్ఠంగా రూ. 46,500 వరకూ ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో ముఖ్యంగా బిజినెస్‌ స్కూళ్ళలో ఖర్చు అధికం. దీని ఖర్చు శ్రేణి ఏడాదికి రూ. 2,28,750 నుంచి రూ. 7.6 లక్షల వరకూ ఉంటుంది.

పనిచేసే అవకాశాలు: అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 20 గంటల చొప్పున ఏడాదికి 964 గంటలు పనిచేయవచ్చు. గంటకు కనీసం 9.76 యూరోలను సంపాదించటానికి వీలుంటుంది. విద్యాభ్యాసం పూర్తయ్యాక విద్యార్థులు టెంపరరీ రెసిడెన్స్‌ పర్మిట్‌పై సంవత్సరం పాటు ఫ్రాన్స్‌లో నివసించవచ్చు. వారికి ఉద్యోగం లభిస్తే దాన్ని పొడిగించే అవకాశం ఉంది.

స్వాగతిస్తున్నాయ్‌ సరికొత్త దేశాలు! 

ఇటలీ

సాంకేతికతలో మౌలిక పరిశోధనలు ఇటలీ ప్రత్యేకత. ఉన్నతవిద్యలోని ప్రతి రంగంలో.. ముఖ్యంగా డిజైనింగ్‌, ఆర్కిటెక్చర్‌, అప్లయిడ్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌ల్లో ఈ దేశం అగ్రగామిగా సాగుతోంది. 
అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్య: సాధారణంగా ఇక్కడ బాచిలర్‌ డిగ్రీని డిగ్రీ కోర్సుగా పిలుస్తారు. దీని కాలవ్యవధి 3 సంవత్సరాలు. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో విద్యాసంవత్సరం అక్టోబరులో ప్రారంభమవుతుంది.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్య: మాస్టర్స్‌కు రెండేళ్లు, పీహెచ్‌డీకి మూడేళ్లు. విద్యాసంవత్సరం ఆరంభం- అక్టోబరులో.

ఖర్చు: యూరప్‌లోని ఇతర దేశాలతో పోలిస్తే ఇటలీలో ట్యూషన్‌ ఫీజు తక్కువ. బాచిలర్‌, మాస్టర్‌ ప్రోగ్రాములకు ఫీజు సరాసరిగా ఏడాదికి రూ. 61,000 నుంచి రూ.1,14,000 వరకూ ఉంటుంది. ఇక్కడి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మాత్రం చాలా ఖరీదైనవి. అంతర్జాతీయ విద్యార్థులకు ఉపకార వేతనాల సౌకర్యం ఉంది.

ఉద్యోగావకాశాలు: అంతర్జాతీయ విద్యార్థులు ఒక వారానికి 20 గంటలపాటు పనిచేయవచ్చు. గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు టెంపరరీ స్టే పర్మిట్‌ కింద ఆరు నెలల నుంచి ఏడాదిపాటు ఉండవచ్చు. ఫ్రాన్స్‌, జర్మనీ మొదలైన ఇతర యూరోపియన్‌ దేశాలతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు మాత్రం చాలా తక్కువ.

స్వాగతిస్తున్నాయ్‌ సరికొత్త దేశాలు! 

జపాన్‌

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశోధన సౌకర్యాలు జపాన్‌ విశిష్టత. చాలా జపనీస్‌ విశ్వవిద్యాలయాలు కొన్ని నిర్ణీత అంశాల్లోని కోర్సులను ఆంగ్ల¹ంలోనే అందిస్తున్నాయి. ఇక్కడ ఒక్కో ప్రోగ్రామ్‌కు అయ్యే ఖర్చు యూకే/ యూఎస్‌ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే ఎక్కువే.

అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్య: ఇక్కడ జాతీయ, ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలున్నాయి. అండర్‌గ్రాడ్యుయేషన్‌ కాలవ్యవధి 4 సంవత్సరాలు. కానీ మెడిసిన్‌, డెంటిస్ట్రీ, వెటర్నరీ సైన్స్‌ డిపార్ట్‌మెంట్ల విషయానికొచ్చేసరికి ఇది ఆరు సంవత్సరాలు.

పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్య: గ్రాడ్యుయేట్‌ స్కూల్‌లో విద్యను పూర్తిచేయడానికి పట్టే సమయం విద్యార్థి ఎంచుకున్న (మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌/ డాక్టర్స్‌ ప్రోగ్రామ్‌) ప్రోగ్రామ్‌ను బట్టి ఉంటుంది. మాస్టర్‌ ప్రోగ్రామ్‌కు అయితే రెండేళ్లు, డాక్టర్స్‌ ప్రోగ్రామ్స్‌కు అయితే అయిదేళ్ల సమయం పడుతుంది. జపనీస్‌ స్కూళ్ల విద్యాసంవత్సరం సాధారణంగా ఏప్రిల్‌తో మొదలై మరుసటి ఏడాది మార్చితో ముగుస్తుంది. కొన్ని తరగతులు సంవత్సరం పొడవునా నడుస్తాయి. మరొకొన్ని సెమిస్టర్లుగా విడిపోయి మొదటి సెమిస్టర్‌ ఏప్రిల్‌- సెప్టెంబరు వరకూ, రెండో సెమిస్టర్‌ అక్టోబరు నుంచి మార్చి వరకూ ఉంటాయి. సాధారణంగా విద్యార్థులు ఏప్రిల్‌లో తమ దరఖాస్తులు పంపి, పేర్లు నమోదు చేసుకుంటారు. కొన్ని సంస్థలు అక్టోబరు సమయంలోనూ ప్రవేశాలకు అనుమతిస్తాయి.

ఖర్చు: అండర్‌ గ్రాడ్యుయేట్స్‌కు ట్యూషన్‌ ఫీజు కనీసం రూ.4,53,000 నుంచి రూ.32 లక్షల వరకూ ఉంటుంది. గ్రాడ్యుయేట్లకు రూ.4,62,000 నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటుంది.

ఉద్యోగావకాశాలు: కాలేజ్‌ స్టూడెంట్‌ వీసాతో పనిచేసే అర్హత విద్యార్థులకు ఉండదు. ఒకవేళ వారు ఎక్కడైనా పనిచేయాలనుకుంటే వర్క్‌ పర్మిట్‌ నిమిత్తం ఇమిగ్రేషన్‌ బ్యూరోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఈ పర్మిట్‌ను రెసిడెన్స్‌ స్టేటస్‌గా ఇచ్చేవారు. ఇప్పుడు పని నిమిత్తం ఇస్తున్నారు. ఈ పర్మిట్‌ ఆమోదం పొందితే వారానికి 28 గంటలు పనిచేసుకునే వీలుంటుంది. ఒకసారి చదువు పూర్తయ్యాక విద్యార్థి టెంపరరీ రెసిడెన్స్‌ స్టేటస్‌పై ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉండవచ్చు. ఒకవేళ ఉద్యోగాన్ని పొందితే, వీసాను పొడిగించుకోవచ్చు.

స్వాగతిస్తున్నాయ్‌ సరికొత్త దేశాలు! 

నెదర్లాండ్స్‌

పందొమ్మిదో శతాబ్దం మొదటి నుంచీ నెదర్లాండ్స్‌ విద్యాసంస్థలు ప్రాచుర్యం పొందుతూవచ్చాయి. ఈ దేశంలోని విద్యాసంస్థల్లో ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌, హ్యూమన్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో విదేశీ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్య: నెదర్లాండ్‌ విశ్వవిద్యాలయాల్లో అండర్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కాలవ్యవధి 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. విద్యాసంవత్సరం సెప్టెంబర్‌ మధ్య నుంచి ప్రారంభమై మరుసటి ఏడాది జూన్‌తో ముగుస్తుంది. కొన్ని సంస్థలు ఏడాది పొడవునా ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నాయి.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్య: మాస్టర్‌ డిగ్రీ కాలవ్యవధి 1 నుంచి 4 సంవత్సరాల వరకూ ఉంటుంది. వీటిల్లో ప్రవేశాన్ని పొందాలంటే 6-8 నెలల ముందస్తు దరఖాస్తు తప్పనిసరి. సెప్టెంబర్‌లో మొదలయ్యే ఫాల్‌ ఇన్‌టేక్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

ఖర్చు: ట్యూషన్‌ ఫీజు తక్కువ, జీవనానికి అయ్యే ఖర్చు ఇంకా తక్కువ. బాచిలర్‌ ప్రోగ్రామ్‌కు అయ్యే ఖర్చు సరాసరి రూ. 4,57,560 - రూ.11,43,750 మధ్య అవుతుంది. మాస్టర్‌ ప్రోగ్రామ్‌లకు అయితే రూ.6,10,000 - రూ.15,25,000 అవసరం. అంతర్జాతీయ విద్యార్థులకు ఇక్కడి విశ్వవిద్యాలయాలు చాలారకాల ఉపకార వేతనాలను అందిస్తున్నాయి.

ఉద్యోగావకాశాలు: ఏప్రిల్‌ 2017 నుంచి అందరు విద్యార్థులూ తమ చదువుతోపాటు పార్ట్‌టైం జాబ్‌ను వారానికి 10 గంటల చొప్పున పనిచేసే అవకాశముంది. స్వయం ఉపాధికి పనిగంటల నిబంధన వర్తించదు. ఓరియెంటేషన్‌ ఇయర్‌ పథకం ప్రకారం.. నెదర్లాండ్స్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసుంటే పనిచేయడానికైనా, సొంత సంస్థను ఏర్పాటు చేసుకోవడానికైనా వర్క్‌ పర్మిట్‌ అవసరం లేదు.

స్వాగతిస్తున్నాయ్‌ సరికొత్త దేశాలు! 

వెస్ట్‌ ఇండీస్‌

క్కడి విద్యావకాశాలు యూఎస్‌ మాదిరిగానే ఉంటాయి. మెడిసిన్‌ చదవడానికి ఉన్న మంచి అవకాశాల్లో కరేబియన్‌ ఒకటి. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టరీ (ఐఎండీ)లో నమోదైన ఎన్నో మెడికల్‌ స్కూళ్లను కలిగి ఉండటంతో.. దేశీయ కళాశాలలకు ప్రత్యామ్నాయాలను వెదుకుతున్నవారికి ఇదో ఎంచుకోదగ్గ గమ్యమైంది.

వైద్యవిద్య: ఇక్కడి వైద్య విద్యాసంస్థలు చాలావరకూ అమెరికా, కెనడా తరహా పాఠ్యాంశాల ఆధారంగానే బోధిస్తాయి. యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్స్‌ ఎగ్జామ్‌ (యూఎస్‌ఎంఎల్‌ఈ)లో అనేక విభాగాల్లో అర్హత సాధించేలా విద్యార్థిని తీర్చదిద్దడానికి అమెరికా వైద్య విద్యాసంస్థలు అనుసరించే విధానం, ఫిజీషియన్లుగా స్థిరపడటానికి ముందు అర్హత సాధించాల్సిన మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కెనడా క్వాలిఫయింగ్‌ ఎగ్జామినేషన్‌ (ఎంసీసీక్యూఈ) విధానాలనే కరేబియన్‌ విద్యాసంస్థలూ అనుసరిస్తాయి. చాలామంది విద్యార్థులు కరేబియన్‌ మెడికల్‌ స్కూళ్లలో చదవడానికి మొగ్గు చూపడానికి కారణం- యూఎస్‌, కెనడియన్‌ మెడికల్‌ స్కూళ్లతో పోలిస్తే ఇక్కడ ఖర్చు, పోటీ తక్కువ. కొన్ని స్కూళ్లు కోర్సు వ్యవధిలోని మూడు, నాలుగు సంవత్సరాల్లో క్లినికల్‌ రొటేషన్‌ కింద యూఎస్‌ ఆస్పత్రుల్లో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఖర్చు: ఇక్కడ ఫీజు అమెరికన్‌ మెడికల్‌ స్కూళ్ల ఫీజులో నాలుగో వంతు మాత్రమే. యూఎస్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దీనికి విలువ ఉంది. మొత్తం వైద్యవిద్యా కోర్సుకు సగటున రూ. 68 లక్షల నుంచి రూ. 1.3 కోట్ల వరకూ ఉంటుంది.

ఉద్యోగావకాశాలు: కోర్సు పూర్తయ్యాక విద్యార్థులు అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ, చాలామంది విద్యార్థులు యూఎస్‌కు వెళ్లడానికి మొగ్గు చూపుతారు. యూఎస్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు తక్కువ. అయినప్పటికీ ఇక్కడ చదవడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య తక్కువ కాబట్టి, సులువుగా సీటు దక్కించుకోవచ్చు.

స్వాగతిస్తున్నాయ్‌ సరికొత్త దేశాలు! 

ఎల్లలు దాటి వెళ్తే ఏంటి లాభం? 
స్వాగతిస్తున్నాయ్‌ సరికొత్త దేశాలు! 

న్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్ళినపుడు అక్కడి సంస్కృతీ, జీవన శైలీ కొత్తగానూ, అబ్బురంగానూ అనిపిస్తాయి. దాన్ని జీర్ణించుకుని సర్దుబాటు చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఒంటరితనం, ఇంటిమీద బెంగ సహజం. కానీ ఈ తొలిదశ దాటాక స్వతంత్రంగానూ, బాధ్యతాయుతంగానూ విద్యార్థి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. భిన్నదేశాల వారితో కలిసిమెలిసి చదువుకోవడం వల్ల విద్యాపరంగా శ్రేష్ఠతకూ, విశాల దృష్టికీ ఆస్కారం ఏర్పడుతుంది!

స్వాగతిస్తున్నాయ్‌ సరికొత్త దేశాలు! 

దరఖాస్తు దశలో దేని తర్వాత ఏది? 

దరఖాస్తు దశలో దేని తర్వాత ఏది? 

విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాన్ని పొందటం కోసం దరఖాస్తులు పంపుకునే తరుణమిది. వీసా వరకూ కొనసాగే ఈ మొత్తం ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి కొన్ని నెలల సమయమూ పట్టొచ్చు. కాబట్టి విశ్వవిద్యాలయాలకు ఎల్లప్పుడూ ముందస్తుగా దరఖాస్తు చేేసుకోవడం ఉత్తమం. 
ఏ విదేశీ విశ్వవిద్యాలయంలో చదవాలన్న విషయంలో పూర్తి వివరాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం కీలకం. కింది అంశాలు సరైన నిర్ణయం తీసుకోవడంలో వేటిని దృష్టిలో ఉంచుకోవాలో తెలియజేస్తాయి. 
ర్యాంకింగులు: విద్యార్థికి తన అకడమిక్స్‌లో మంచి మార్కులు, మంచి టెస్ట్‌ స్కోర్లను కలిగి ఉంటే ర్యాంకింగ్‌ విశ్వవిద్యాలయాలను ఎంచుకోవచ్చు. ఇవి నాణ్యమైన బోధన, పరిశోధన, ప్రపంచ స్థాయి వైఖరులను అందిస్తాయనే విశ్వసనీయ సూచనను చేస్తున్నాయి. కానీ వీటిలో సీటు సాధించడానికి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ర్యాంకింగ్‌ లేకపోయినా గొప్ప పేరున్న విశ్వవిద్యాలయాలు చాలా ఉన్నాయి. ఐఐటీలు మినహా మిగతా అన్ని భారతీయ విశ్వవిద్యాలయాలకంటే ఇవి చాలా మెరుగు. 
మీ ప్రత్యేక అవసరాలకు తగ్గ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడానికి దగ్గరి దారంటూ ఏం లేదు. కాబట్టి ర్యాకింగులు, పేరు మీదే ఆధారపడి నిర్ణయం తీసుకోకూడదు. ఇంకా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలున్నాయి. వాటినీ పరిశీలించాలి. 
వ్యయం: విద్యార్థి తన కుటుంబ ఆర్థిక సామర్థ్యం ఆధారంగా విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవచ్చు. విదేశాల్లో చదవడానికి తమకు ఎంతవరకూ ఆర్థిక సామర్థ్యముందో స్పష్టతతో ఉండటం అవసరం. ఎక్కువ ట్యూషన్‌ ఫీజును వసూలు చేసే విశ్వవిద్యాలయాలూ ఉన్నాయి. అలాగే అసలు ఫీజు తీసుకోనివీ ఉన్నాయి. 
మెరిట్‌, ఆర్థిక అవసరాల ఆధారంగా అంతర్జాతీయ విద్యార్థులకు చాలా రకాల స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం జీవన వ్యయం. ఇది దేశం, ఉండే ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. 
వాతావరణ పరిస్థితులు: చదవాలనుకునే ప్రదేశాన్ని ఎంచుకోవడంలో ఇది కూడా ఒక ముఖ్యమైన కారకమే. విద్యార్థులు తమ చదువును అనుకూల వాతావరణంలోనే నిశ్చింతగా పూర్తిచేయగలుగుతారు. ఇది దేశాన్ని బట్టే కాదు.. విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశాన్ని బట్టి కూడా ఉంటుంది. 
యూఎస్‌ఏలో కాలిఫోర్నియా, ఓరెగన్‌ వంటి వెస్ట్‌కోస్ట్‌ రాష్ట్రాల వాతావరణం మన దేశంలోలానే ఉంటుంది. అదే ఈస్ట్‌ కోస్ట్‌ విషయంలో విపరీతమైన చలితో ఉష్ణోగ్రత మైనస్‌ 18 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకూ ఉంటుంది. కెనడాలో చలి వాతావరణం మంచుతో కూడి ఉంటుంది. ఆస్ట్రేలియా వాతావరణం మనతో పోలి ఉంటుంది. కాబట్టి, మన విద్యార్థులకు ఇది అనుకూలమే.
న్యూజీలాండ్‌లో చల్లగా ఉంటుంది. యూరోపియన్‌ దేశాల్లో వాతావరణం భారత్‌ తరహాలోనే ఉంటుంది కాబట్టి, విద్యార్థులు సులువుగానే అలవాటుపడగలరు. 
వీసా అవకాశాలు 
వీసా దరఖాస్తుల విషయంలో వివిధ దేశాలు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వాటిలో వయసు, విద్యా నేపథ్యం, నిధుల లభ్యత, భాషా నైపుణ్యాలు, చదవదల్చిన కోర్సు వంటి అంశాలున్నాయి. యూఎస్‌ఏ, యూకే, జర్మనీ వంటి కొన్ని దేశాలు వీసా ప్రక్రియకు వ్యక్తిగత ఇంటర్వ్యూను తీసుకుంటాయి. 
కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, న్యూజీలాండ్‌ మొదలైన చాలా దేశాలు వీసా ఫైల్‌ను మాత్రమే పరిశీలన నిమిత్తం తీసుకుంటాయి.
విద్యానంతర అవకాశాలు 
విదేశీ విద్య ఖర్చుతో కూడుకున్నది. చాలామంది భారతీయ విద్యార్థులు తాము ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఎలా రాబట్టుకోవాలో అంచనా వేసుకుని దాని ప్రకారం ప్రణాళికలు వేసుకుంటున్నారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికీ, కెరియర్‌లో దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికీ, అంతర్జాతీయ వాతావరణంలో పనిచేయడానికీ విద్యానంతర అవకాశాల కోసం చూస్తున్నారు.

అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న కొన్ని దేశాలు.. 
యు.ఎస్‌.ఎ.: దేశంలో ఎక్కడైనా ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ రూపంలో ఉద్యోగం చేసుకోవచ్చు. అధికారికంగా ఇలా ఏడాది పనిచేయవచ్చు. దీన్ని స్టెమ్‌ కోర్సుల (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌) విద్యార్థులకు 24 నెలలవరకూ పొడిగించవచ్చు. 
కెనడా: ఇక్కడ పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌ అంతర్జాతీయ విద్యార్థులు ఈ దేశంలో పనిచేయటానికి వీలు కల్పిస్తుంది. విద్యాభ్యాస వ్యవధిని బట్టి ఇది ఏడాది నుంచి మూడేళ్ళ వరకూ ఉంటుంది. 
ఆస్ట్రేలియా: ఈ దేశంలో పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌ ఉంది. విద్యాభ్యాస కాలం కనీసం రెండు సంవత్సరాలుంటే ఈ పర్మిట్‌ కాలం కూడా అంతే వ్యవధి ఉంటుంది. 
న్యూజీలాండ్‌: ఈ దేశంలో పోస్ట్‌ స్టడీ వర్క్‌ పర్మిట్‌ అధికారికంగా సంవత్సర కాలం ఉంటుంది. 
ఐర్లాండ్‌: ఇక్కడ వర్క్‌ పర్మిట్‌ ద్వారా అధికారికంగా రెండేళ్ళ పాటు ఉద్యోగం చేసుకునే వీలు ఉంది. 
జర్మనీ: ఈ దేశంలో జాబ్‌ సీకర్స్‌ వీసా 18 నెలలపాటు ఉంటుంది. దీనిద్వారా ఆ వ్యవధిలో అంతర్జాతీయ విద్యార్థులు అధికారికంగా ఉద్యోగం చేయవచ్చు. 
యు.కె.: ఇక్కడ అంతర్జాతీయ విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తిచేశాక పనిచేయటానికి వీలు లేదు. కానీ కొద్ది విశ్వవిద్యాలయాలు యు.కె.లో ఇంటర్న్‌షిప్‌ల ద్వారా పనిచేయడానికి వీలు కల్పిస్తాయి.

యు.ఎస్‌.ఎ. 
దరఖాస్తు దశలో దేని తర్వాత ఏది? 

తమకు అనుకూలమైన విశ్వవిద్యాలయాలను ఎంచుకోవడం పూర్తయ్యాక విద్యార్థులు దరఖాస్తును పంపటానికి అవసరమైన అంశాలు, తుదిగడువులను చూసుకోవాలి. 
తొలి అడుగు: అడిగిన సమాచారంతో దరఖాస్తును (ఆన్‌లైన్‌/ పేపర్‌) సమర్పించాలి. 
రెండు: దరఖాస్తు ఫీజును చెల్లించాలి (చాలావరకూ యూఎస్‌ విశ్వవిద్యాలయాలు దరఖాస్తులను పరిశీలించి, వాటిని పరిష్కరించడానికి ఫీజు వసూలు చేస్తాయి). కొన్ని విశ్వవిద్యాలయాలు దరఖాస్తు ఫీజును తీసుకోవు. విశ్వవిద్యాలయాన్ని బట్టి ప్రతీ దరఖాస్తుకు 25 నుంచి 200 యూఎస్‌ డాలర్ల వరకూ వసూలు చేస్తారు. దీన్ని దరఖాస్తు ప్రక్రియ నిమిత్తం తీసుకుంటారు. దరఖాస్తు తిరస్కరణకు గురైనా డబ్బును తిరిగి చెల్లించరు. 
మూడు: అఫిషియల్‌ ట్రాన్‌స్క్రిప్ట్స్‌, లెటర్‌ ఆఫ్‌ రెకమండేషన్స్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌.. మొదలైన పత్రాలన్నింటినీ విశ్వవిద్యాలయానికి మెయిల్‌ చేయాలి. 
జనరల్‌ యు.ఎస్‌.ఎ. డాక్యుమెంట్ల వివరాలు 
అంతర్జాతీయ ప్రవేశాలకు కావాల్సిన కనీస పత్రాలతోపాటు కొన్ని డిపార్ట్‌మెంట్లు అదనంగా జీఆర్‌ఈ, జీమ్యాట్‌ లేదా ప్రత్యేకమైన దరఖాస్తును కోరే అవకాశముంది. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, రెకమెండేషన్‌ లెటర్స్‌ వంటి అదనపు మెటీరియళ్లను నేరుగా డిపార్ట్‌మెంట్‌కే సమర్పించమని కోరవచ్చు. 
నాలుగు: టెస్టింగ్‌ ఏజెన్సీ నుంచి విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా అధికారికంగా టెస్టింగ్‌ స్కోర్లను పంపించేలా చూడటం. 
ఐదు: విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థికి సంబంధించిన గ్రాడ్యుయేట్‌ దరఖాస్తు పత్రాలు సంబంధిత డిపార్ట్‌మెంటుకు వెళతాయి. సంబంధిత డిపార్ట్‌మెంట్‌ అధ్యాపకులు దరఖాస్తును సమీక్షించి, ప్రవేశానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ దరఖాస్తు ప్రక్రియ కేంద్రీకృత ప్రక్రియ. సంబంధిత నిర్ణయాన్ని అంతర్జాతీయ ప్రవేశాల బృందం తీసుకుంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పరిశీలన, తగిన విద్యార్థుల ఎంపిక ఖరారుకు కనీసం రెండు వారాల నుంచి 6 నెలల సమయం పడుతుంది. 
ఆరు: చివరగా వారు ఐ-20 ఫారాన్ని రూపొందించి, విద్యార్థి మెయిల్‌కు పంపుతారు (ఐ-20 పత్రం విద్యార్థిని వీసా ఇంటర్వ్యూకు హాజరవడానికి అనుమతిస్తుంది). ఐ-20 ఫారాన్ని రూపొందించటానికి రెండు రోజుల నుంచి రెండు వారాల సమయం పడుతుంది.

దేశాలవారీగా... 
దరఖాస్తు దశలో దేని తర్వాత ఏది? 

ప్రతి విశ్వవిద్యాలయానికీ ప్రత్యేకమైన దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. అది పేపర్‌ ఆధారితం అయినా, ఆన్‌లైన్‌ దరఖాస్తు అయినా కావొచ్చు. 
విశ్వవిద్యాలయాలను ఎంచుకోవడం పూర్తయ్యాక విద్యార్థులు దరఖాస్తును ప్రారంభించేముందు వాటి దరఖాస్తు అవసరాలు, తుదిగడువులను సరిచూసుకోవాలి. 
1. అవసరమైన సమాచారంతో దరఖాస్తును నింపి, ఆన్‌లైన్‌లో సమర్పించాలి. 
2. దరఖాస్తు ఫీజును చెల్లించాలి. విశ్వవిద్యాలయాన్ని బట్టి ప్రతి దరఖాస్తుకూ 50 నుంచి 200 కెనడియన్‌ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశాన్ని తిరస్కరించినా దరఖాస్తు ప్రక్రియకు కట్టే ఫీజును విశ్వవిద్యాలయం తిరిగి చెల్లించదు. 
3. అఫిషియల్‌ ట్రాన్‌స్క్రిప్ట్స్‌, లెటర్‌ ఆఫ్‌ రెకమెండేషన్స్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సస్‌, రెజ్యూమే వంటి పత్రాలన్నింటినీ విశ్వవిద్యాలయానికి మెయిల్‌ చేయాలి. గమనిక: చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ రెకమెండేషన్లనే అనుమతిస్తాయి. 
అంతర్జాతీయ ప్రవేశాలకు కావాల్సిన కనీస పత్రాలతోపాటు కొన్ని డిపార్ట్‌మెంట్లు తమకంటూ జీఆర్‌ఈ, జీమ్యాట్‌ లేదా ప్రత్యేకమైన దరఖాస్తులను కోరే అవకాశముంది. ఎస్‌ఓపీ, రెకమెండేషన్‌ లెటర్స్‌ వంటి మెటీరియళ్లను నేరుగా డిపార్ట్‌మెంట్‌కే సమర్పించమని కోరవచ్చు. 
4. టెస్టింగ్‌ ఏజెన్సీ నుంచి విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా అధికారికంగా టెస్టింగ్‌ స్కోర్లను పంపించేలా చూడటం. 
5. విశ్వవిద్యాలయం విద్యార్థి నుంచి అన్ని అవసరమైన పత్రాలను అందుకున్నాక గ్రాడ్యుయేట్‌ దరఖాస్తు పత్రాలు సంబంధిత డిపార్ట్‌మెంట్‌కు వెళతాయి. సంబంధిత డిపార్ట్‌మెంట్‌ అధ్యాపకులు దరఖాస్తును సమీక్షించి, ప్రవేశానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ దరఖాస్తు ప్రక్రియ కేంద్రీకృత ప్రక్రియ. సంబంధిత నిర్ణయాన్ని అంతర్జాతీయ ప్రవేశాల బృందం తీసుకుంటుంది. దరఖాస్తు లపై నిర్ణయాన్ని తీసుకోవడానికి కనీసం 2 వారాల నుంచి 6 నెలల సమయం పడుతుంది. 
6. ఒకవేళ విద్యార్థి ప్రవేశం పొందితే ట్యూషన్‌ ఫీజు, షరతులేమైనా ఉంటే వాటి వివరాలతో కూడిన కండిషన్‌ ఆఫ్‌ ఆక్సెప్టెన్స్‌ లెటర్‌ను విశ్వవిద్యాలయం పంపుతుంది. విద్యార్థి దానికి సమ్మతి తెలిపి, తిరిగి పంపించాల్సివుంటుంది. 
7. కండిషన్‌ ఆఫ్‌ ఆక్సెప్టెన్స్‌ లెటర్‌లో పేర్కొన్నట్లుగా ఒక సెమిస్టర్‌ ఫీజును విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు తర్వాత విశ్వవిద్యాలయం స్టడీ పర్మిట్‌ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా లెటర్‌ ఆఫ్‌ ఆక్సెప్టెన్స్‌ను పంపుతుంది. 
డిప్లొమా, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులువు.

ఆస్ట్రేలియా 
దరఖాస్తు దశలో దేని తర్వాత ఏది? 

1. ఎంపిక చేసుకున్న ఆస్ట్రేలియన్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి విద్యార్థి పూర్తిచేసిన దరఖాస్తు ఫారం, సపోర్టింగ్‌ ఫారాలతోపాటు తన అకడమిక్‌ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, ఐఈఎల్‌టీఎస్‌/ పీటీఈ మార్క్‌ షీటు, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ లెటర్ల స్కాన్‌ కాపీలను పంపాల్సి ఉంటుంది. 
2. దరఖాస్తు, ఇతర పత్రాలను సమీక్షించిన తరువాత నిర్ణయాన్ని రెండు రోజుల నుంచి ఒక నెలరోజుల్లోపు వెల్లడిస్తారు. 
3. ఆఫర్‌ లెటర్‌ అందుకున్నాక విశ్వవిద్యాలయానికి ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లను పంపాల్సి ఉంటుంది. తద్వారానే పాక్షిక ఫీజు చెల్లింపునకు ఆమోదం లభిస్తుంది. 
4. అప్రూవల్‌ ఆఫ్‌ పేమెంట్‌ను అందుకున్నాక ఎలక్ట్రానిక్‌ కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నిమిత్తం విద్యార్థి పాక్షిక ఫీజును చెల్లించాల్సి ఉంటుంది (ఆఫర్‌ లెటర్‌లో చెప్పినట్లుగా). 
5. ఎలక్ట్రానిక్‌ కన్ఫర్మేషన్‌ ఆఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ అందుకున్నాక విద్యార్థులకు స్టూడెంట్‌ వీసాకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది.

పిటిషన్‌ చెల్లుబాటులో ఉంటే ప్రయాణం చేయవచ్చు 

పిటిషన్‌ చెల్లుబాటులో ఉంటే ప్రయాణం చేయవచ్చు 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించిన అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి... 
హెచ్‌1బి వీసాపై అమెరికాలోని ఓ క్లయింటు వద్ద పని చేస్తున్నాను. ఆ సంస్థ నుంచి మారాలనుకుంటున్నాను. హెచ్‌1బి వీసాను బదలాయించేందుకు నూతన యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈలోగా భారత్‌ వద్దామనుకుంటున్నాను. తిరుగు ప్రయాణంలో ఇబ్బంది అవుతుందా?  

- వెంకటరాజు కేవీ 

అమెరికాలో మీరు పని చేస్తున్న యాజమాన్యం ద్వారా వచ్చిన పిటిషన్‌ చెల్లుబాటులో ఉంటే ప్రస్తుత హెచ్‌1బి వీసాపై మీరు ప్రయాణం చేయవచ్చు. నూతన పిటిషన్‌ ఆమోదం పొందే సమయానికి మీరు అమెరికా వెలుపల ఉన్న పక్షంలో నూతన వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వర్క్‌ వీసా సమాచారానికి www.uscis.gov ను చూడండి.

డిపెండెంట్‌ వీసాపై అమెరికాలో ఉంటున్నాను. అమెరికా రాక మునుపు 2015లో ఎఫ్‌-1 వీసా కోసం రెండు దఫాలు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. వివాహం తరవాత భర్తతో కలిసి అమెరికా వచ్చాను. ఇక్కడ మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. హెచ్‌-4 వీసా నుంచి ఎఫ్‌-1 వీసా మార్చుకోవచ్చా? 

 - పద్మజా వెలిమినేడు 

చెల్లుబాటు అయ్యే హెచ్‌-4 వీసా ద్వారా విద్యా సంస్థలకు హాజరయ్యేందుకు అర్హులే. మీరు కూడా ఎఫ్‌-1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో ఇతర దరఖాస్తుదారుల మాదిరిగానే మీరు ఎఫ్‌-1 వీసాకు అర్హులా? కాదా? అన్నది కాన్సులర్‌ అధికారి నిర్ణయం తీసుకుంటారు. అమెరికాలో విద్యాభ్యాసం తదితర సమాచారం కోసం ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఎ వెబ్‌సైట్‌ Rhttps://educationusa.gov ను పరిశీలించండి.

పర్యాటక వీసా దరఖాస్తు విధానమేమిటి? 

 - శ్రీనివాసరాజు మంగపూడి 

వీసా ప్రక్రియలో తొలిదశ వెబ్‌సైట్‌లో మీ ప్రొఫైల్‌ను తయారు చేసుకోవటం, ఎమ్మార్వీ ఫీజు చెల్లించటం, వేలిముద్రల కోసం వీసా దరఖాస్తు కేంద్రంలో సమయాన్ని షెడ్యూల్‌ చేసుకుని ఆ తరవాత కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకు అపాయింటుమెంటును షెడ్యుల్‌ చేసుకోవాలి. దరఖాస్తు విధానాన్ని ‌www.traveldocs.com/in లో వివరించారు. మరింత సమాచారానికి 040 4625 8222, 0120 4844644 నంబర్లకు ఫోన్‌ చేయండి.

నేను విద్యార్థి వీసా(ఎఫ్‌-1)దారుడను. భారతదేశం వద్దామనుకుంటున్నాను. నా వీసా, పాస్‌పోర్టులు చెల్లుబాటులో ఉన్నాయి. ఎస్‌ఈవిఐఎస్‌ నంబరులోనూ మార్పులు లేవు. అయితే, ఎఫ్‌-1 వీసాదారులు మాతృదేశానికి వెళితే మళ్లీ స్టాంపింగ్‌ చేయించుకోవాలని నా మిత్రులు చెబుతున్నారు. ఇది ఎంత వరకు వాస్తవం?

 - రమేష్‌ కాశీనాధుని

 కొన్ని కేసుల్లోనే నూతన వీసా కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి ఎస్‌ఈవిఐఎస్‌ నంబరులో, విశ్వవిద్యాలయంలో మార్పులున్నా, అమెరికాలో చివరిసారిగా చదువుకుని అయిదు నెలలు దాటిన వారే నూతన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.

మీకేమైనా ప్రశ్నలుంటే 040 4625 8222, 0120 4844644 నంబర్లకు ఫోన్‌ చేయండి లేదా ‌supportindia@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేయండి. 
వీసాలకు సంబంధించిన నిర్దిష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను supportindia@ustraveldocs.com  కు ఈ-మెయిల్‌ చేేయండి. 
మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసాసేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.

అమెరికాలో ప్రవేశించేలోగా స్టాంప్‌ చేయించుకోవాలి 

అమెరికాలో ప్రవేశించేలోగా స్టాంప్‌ చేయించుకోవాలి 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి...

హెచ్‌1బి వీసాపై అమెరికాలో ఉన్నాను. మరో ఆరు నెలలపాటు ఆ వీసా చెల్లుబాటులో ఉంటుంది. క్లయింటును మార్చుకుందామనుకుంటున్నా. ప్రస్తుతం ఉన్న నగరంలోనే ఉద్యోగం లభించనుంది. ఆ వీసాను వినియోగించవచ్చా? లేక నూతన వీసా పొందాలా?

 - ప్రసాద్‌ ఎం

హెచ్‌1బి పిటిషన్‌ ఆమోదం పొందిన కంపెనీలో మీరు పని చేసిన పక్షంలో మీరు కొనసాగవచ్చు. మీ నూతన పిటిషన్‌ ఆమోదం పొందిన పక్షంలో నూతన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు భారతదేశం వెళ్లినప్పుడు హెచ్‌1బి  స్టాంపింగ్‌ వేయించుకోవాలి. అంటే మీరు మళ్లీ అమెరికాలో ప్రవేశించేలోగా ఆ ప్రక్రియ పూర్తి కావాలి. వర్క్‌ వీసాకు సంబంధించిన మరింత సమాచారం కోసం ‌www.uscis.gov చూడండి.

* బి1 వీసా వచ్చే ఏడాది జనవరిలో కాలం తీరనుంది. ఈ ఏడాది అక్టోబరులో అమెరికాలో జరిగే కుటుంబ కార్యక్రమానికి వెళ్దామనుకుంటున్నాను. ప్రస్తుత వీసాపై వెళ్లవచ్చా? పర్యటనకు ముందుగానే వీసాను పునరుద్ధరించుకోవాలా?   

- కృష్ణమోహన్‌ ఎన్‌

వీసా చెల్లుబాటు అయ్యేలోగా ఎప్పుడైనా మీరు అమెరికా వెళ్లవచ్చు. కాలం తీరక ముందూ వీసాను పునరుద్ధరించుకోవచ్చు. వీసా పునరుద్ధరణ సమయంలో ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హులా? కాదా? అన్నది పరిశీలించుకోండి. మరింత సమాచారం కోసం ‌www.ustraveldocs.com ను పరిశీలించండి. 

ప్రస్తుతం పని చేస్తున్న యాజమాన్యం నుంచి మారాలనుకుంటున్నాను. నా హెచ్‌1బి వీసా బదలాయింపు కోసం నూతన యాజమాన్యం పిటిషన్‌ దాఖలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఆ పిటిషన్‌ ఆమోదం పొందేలోగా ప్రస్తుత హెచ్‌1బిపై భారతదేశం వెళ్లవచ్చా?

- చంద్రశేఖర్‌ కర్రి

పిటిషన్‌ కంపెనీలో మీరు పని చేయకపోయినా, యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకున్నా ప్రస్తుత హెచ్‌1బి వీసాపై మీరు తిరిగి అమెరికా ప్రవేశించలేరు. మీ దగ్గర నూతన పిటిషన్‌ ఉంటే మీరు భారతదేశం వెళ్లి, తిరిగి అమెరికాలో ప్రవేశించే ముందు హెచ్‌1బి వీసా స్టాంపింగ్‌ చేయించుకోవచ్చు. వర్క్‌ వీసాకు సంబంధించిన మరింత సమాచారం కోసం ‌ www.uscis.gov ను చూడండి.

ఎఫ్‌-1 వీసా అయిదుసార్లు తిరస్కరించారు. ప్రతి సందర్భంలోనూ 214(బి) పత్రాన్ని ఇచ్చారు. తిరస్కారానికి సంబంధించిన కారణాలు చెప్పలేదు. విద్యార్థి వీసాను పొందటం ఎలా? 

- అబ్దుల్లా హబీబ్‌

*మీరు దరఖాస్తు చేసుకున్న వీసా విభాగానికి అర్హత ఉన్నట్లు, ఇమిగ్రెంట్‌ వీసా ఉద్దేశాన్ని మీరు కాన్సులర్‌ అధికారికి స్పష్టం చేయలేకపోయిన సందర్భంలోనే 214(బి) పత్రాన్ని ఇస్తారు. ఎఫ్‌-1 వీసాకు అర్హత పొందాలంటే చదువుకునేందుకే అమెరికా వెళుతున్నారన్న ఉద్దేశాన్ని స్పష్టం చేయాలి. ఆయా కోర్సులకు కావాల్సినంతగా సన్నద్ధమైనట్లు, ఆ కోర్సును పూర్తి చేసేందుకు కావాల్సిన ఫీజు చెల్లింపునకు నిర్ధిష్టమైన ప్రణాళిక ఉన్నట్లు రుజువు చేసుకోవాలి. ఆ చదువు పూర్తయ్యాక మాతృదేశానికి తిరిగి వెళతానని స్పష్టం చేయాలి. ఇన్ని దఫాలు తిరస్కారమైన నేపథ్యంలో మరోదఫా దరఖాస్తు చేసే ముందు ఆయా అంశాల్లో మరికొంత అనుభవాన్ని పెంచుకోండి. 
* వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.com కు   ఈ-మెయిల్‌ చేయండి. 
* సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలనుusvisa@eenadu.net  కు పంపగలరు.

యూఎస్‌సీఐఎస్‌ ఆమోదిత పిటిషన్‌ ఉంటేనే..!

యూఎస్‌సీఐఎస్‌ ఆమోదిత పిటిషన్‌ ఉంటేనే..! 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బీ1 వీసాపై అమెరికా వెళ్లి జూన్‌ వరకు ఉన్నాను. 2019 ఫిబ్రవరి వరకు ఉండేందుకు అనుమతిస్తూ స్టాంప్‌ వేశారు. మళ్లీ అమెరికా వెళ్దామనుకుంటున్నా. ఏమైనా సమస్య వస్తుందా?

- వినోద్‌కుమార్‌ మద్దుల

వీసా చెల్లుబాటులో ఉన్న కాలంలో ఎప్పుడైనా మీరు అమెరికా వెళ్లవచ్చు. అమెరికా ప్రవేశ ప్రాంతంలోని డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ మీ పాస్‌పోర్టులోగానీ, ఐ-94లోగానీ పేర్కొన్నంత కాలం మీరు అమెరికాలో ఉండవచ్చు.2019 జనవరి వరకు చెల్లుబాటయ్యే హెచ్‌1బి పిటిషన్‌ ఉంది. ఇప్పటి వరకు స్టాంపింగ్‌కు వెళ్లలేదు. అమెరికా వెళ్లేందుకు ఇటీవల అవకాశం లభించింది. నా పిటిషన్‌ కాలం త్వరలో ముగియనుంది. ఇప్పుడు వీసా స్టాంపింగు కోసం వెళ్తే నా అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? హెచ్‌1బి పొడిగింపును ఎప్పటిలోగా చేయించుకోవాల్సి ఉంటుంది?

- కోటేష్‌ పడుచూరి

హెచ్‌1బి పిటిషన్‌ లేదా ఐ-797లో యునైటెడ్‌ స్టేట్స్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఆమోదించిన మేరకు వీసా చెల్లుబాటులో ఉంటుంది. హెచ్‌1బి పిటిషన్‌ గడువు పొడిగించుకునేందుకు మీ యాజమాన్యాన్ని సంప్రదించాలి. వీసా దరఖాస్తు, అపాయింటుమెంటు తదితర సమాచారం కోసం www.ustraveldocs.com/in చూడండి.ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరంలో ఉన్నాను. ఫాల్‌ సీజనులో ప్రవేశం కోసం అమెరికా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాను. నాలుగో సంవత్సరపు తొలి సెమిస్టర్‌ ధ్రువపత్రాలతో వీసా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చా?

- రమేష్‌ సిలిగురి

మీ ఐ-20లో పేర్కొన్న ప్రవేశ తేదీకి 120 రోజుల ముందుగా మాత్రమే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆమోదం పొందిన వీసాను విద్యా సంవత్సరం ప్రారంభానికి 30 రోజుల ముందు మాత్రమే ప్రయాణానికి వినియోగించాలి. దరాఖాస్తుదారుడి విద్యార్హతలను కాన్సులర్‌ అధికారి స్థూలంగా పరిశీలిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో విద్యార్థులు మునుపటి మార్కులు, బ్యాక్‌లాగ్స్‌, వివిధ పరీక్షల స్కోర్స్‌, ఉన్నత విద్యకు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళిక తదితర విషయాలను ప్రశ్నిస్తారు. ప్రస్తుత మీ అకడెమిక్స్‌ ఆధారంగా ఐ-20 లభిస్తే ఎలాంటి ధ్రువపత్రాలను అందజేయాల్సిన అవసరం ఉండదు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అనుభవం ఉంది. హెచ్‌1బి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చా?

- కేవీ ప్రసాదరావు

హెచ్‌1బి వీసా కోసం దరఖాస్తు చేయాలంటే మీ పక్షాన అమెరికాలోని సంస్థ యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌)కు పిటిషన్‌ దాఖలు చేయాలి. అది ఆమోదం పొందిన తరవాత వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా ప్రక్రియకు సంబంధించిన సమాచారం కోసం ‌www.ustraveldocs.com/in ను పరిశీలించండి.వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌    చేయండి. 
మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.

అమెరికాలో చదివేందుకు ఎస్‌ఏటీ అనివార్యం కాదు 


అమెరికాలో చదివేందుకు ఎస్‌ఏటీ అనివార్యం కాదు 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి... 
నాకు, నా భార్యకు గ్రీన్‌కార్డు ఉంది. ఆరేళ్లుగా అమెరికా వెళ్లలేదు. మా మనవడిని చూసేందుకు అమెరికా వెళ్దామనుకుంటున్నాం. మా బి1/బి2 వీసాను పునరుద్ధరించుకోవచ్చా? ఆ ప్రక్రియ ఏమిటి?

- రామకృష్ణ మలినేని

నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాకు అర్హత పొందాలంటే మీ గ్రీన్‌కార్డులను ముందుగా సరెండర్‌ చేయాలి. అందుకోసం ఐ-407 దరఖాస్తును పంపాలి. ఆ దరఖాస్తు కోసం ‌www.uscis.gov407 ను చూడండి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తరవాత బి1/బి2 వీసా కోసం దరఖాస్తు చేయాలి. పర్యాటక వీసాకు మీరు అర్హులా? కాదా? అన్నది ఇంటర్వ్యూ అధికారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. భారతదేశంలో ఎక్కువ కాలం నివాసం ఉన్న విషయాన్ని వివరించేందుకు మీరు సన్నద్ధంగా ఉండండి. దరఖాస్తుదారులందరికీ వీసా ఆమోదం లభిస్తుందన్న గ్యారెంటీ ఏమీ ఉండదు. వీసా దరఖాస్తు విధానానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ‌www.ustraveldocs.com/in పరిశీలించండి.

నా భార్య మూడు నెలలపాటు అమెరికాలో అదనంగా ఉన్నారు. గడువు ముగియటానికి ముందుగానే పొడిగింపునకు దరఖాస్తు చేసుకోగా అనుమతి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు అనుమతి పత్రం కనిపించటం లేదు. దానికి సంబంధించిన కంప్యూటర్‌ స్క్రీన్‌ షాట్‌ ఉంది. వీసా పునరుద్ధరణకు ఇటీవల దరఖాస్తు చేస్తే ఒరిజినల్‌ పొడిగింపు పత్రం తీసుకురమ్మన్నారు. వీసా పొందటం ఎలా?

- రమణమూర్తి ఎన్వీ

వీసా గడువు పొడిగింపు నకలు కోసం యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌  సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌)ను అడగండి. ఆయా వివరాలకు www.uscis.gov సంప్రదించండి. వీసా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గడువుకు మించి అమెరికాలో ఉండటానికి గల కారణాలను ఇంటర్వ్యూ సమయంలో వివరించేందుకు సన్నద్ధమై ఉండండి.

నేను గ్రీన్‌కార్డుదారుడను. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాను. మరో 45 రోజులపాటు ఉంటాను. ఈ నెలాఖరులోగా నా పాస్‌పోర్టు కాలం తీరనుంది. దాన్ని ఇక్కడే పునరుద్ధరించుకోవాలా? అమెరికాలో చేసుకోవాలా?

- నరసింహమూర్తి సీవీ

మీ పాస్‌పోర్టు కాలం తీరేలోపు మీరు ఎప్పుడైనా అమెరికాలోకి ప్రవేశించవచ్చు. అయితే, ఇతర దేశాల పర్యటనలో ఉండగా పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఉండదు. మీరు ఇతర దేశాల్లో అడుగుపెట్టే ముందు ఆయా దేశాల నిబంధనలను తెలుసుకోవటం మంచిది.

నెల వ్యవధిలో నా ఎఫ్‌-1 వీసా రెండు దఫాలు తిరస్కరించారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు ఎస్‌ఏటీ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలని ఇంటర్వ్యూ సమయంలో కాన్సులర్‌ అధికారి చెప్పారు. నా మిత్రులు కొందరు ఎస్‌ఏటీ పరీక్ష రాయకపోయినప్పటికీ ఎఫ్‌-1 వీసా పొందారు. ఎస్‌ఏటీ అనివార్యమా? ఐచ్ఛికమా?

-ప్రద్యుమ్నకాంత్‌

అమెరికాలో చదివేందుకు ఎస్‌ఏటీ మార్కులు అనివార్యం కాదు. విశ్వవిద్యాలయమో, విద్యాసంస్థో ఎస్‌ఏటీ మార్కులను అడిగి ఉంటే కాన్సులర్‌ అధికారి ప్రస్తావించి ఉంటారు. అమెరికాలో ఉన్నత విద్యను చదివేందుకు ఎస్‌ఏటీ, టోఫెల్‌ మార్కులను ప్రామాణికంగా భావించటం పరిపాటే. సాధారణంగా ఎఫ్‌-1 వీసా అర్హత పొందేందుకు అమెరికా వెళుతున్నది ప్రధానంగా చదువు కోసమేనని కాన్సులర్‌ అధికారికి దరఖాస్తుదారుడు స్పష్టం చేయాల్సి ఉంటుంది.

వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.com కు   ఈ-మెయిల్‌ చేయండి.
సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు.
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.
ఆ కంపెనీలో పని చేస్తేనే చెల్లుబాటు 

ఆ కంపెనీలో పని చేస్తేనే చెల్లుబాటు 
 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి.. 
2012లో నా పర్యాటక వీసా కాలం తీరింది. 2002 నుంచి 2005 మధ్య కాలంలో రెండు సార్లు అమెరికా వెళ్లి వచ్చాను. ఆ తరవాత వెళ్లలేదు. ప్రస్తుతం వీసాను పునరుద్ధరించుకోవచ్చా?

- కేవీ రంగయ్య

ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హత పొందేందుకు మీకు చాలా వ్యవధి గడిచింది. నూతన వీసాకోసం ‌www.ustraveldocs.com/in ను చూడండి. అందులో మీ ప్రొఫైల్‌ను రూపొందించుకుని, ఎమార్వీ ఫీజు చెల్లించి వీసా దరఖాస్తు కేంద్రంలో వేలిముద్రలు ఇచ్చేందుకు, కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అపాయింటుమెంటును ఖరారు చేసుకోవచ్చు.

గత ఏడాది భారతదేశం వచ్చాను. 2019 సెప్టెంబరు వరకు నా హెచ్‌1బి వీసా చెల్లుబాటులో ఉంటుంది. యాజమాన్యం వీసాను రద్దు చేయలేదు. అమెరికా వెళ్లేందుకు ప్రాజెక్టు కోసం అన్వేషిస్తున్నాను. అధిక సంస్థలు అమెరికాలో ఉంటున్న వారినే చూస్తున్నాయి. ఏదో ఒక ప్రాజెక్టును పొందేందుకు నేను అమెరికా వెళ్లవచ్చా?

  - హర్ష పగడాల

హెచ్‌1బి వీసాపై అమెరికా వెళ్లాలంటే మీరు ఆ వీసాలో పేర్కొన్న హోదాలో పనిచేస్తూ ఉండాలి. పిటిషన్‌ ఆమోదం పొందిన సంస్థలో మీరు పని చేయకపోయినా, మీ ఉపాధిలోని ఇతర అంశాలు మారినా ఆ హెచ్‌1బి వీసాపై మీరు అమెరికా వెళ్లలేరు.

ఈ సెప్టెంబరులో అమెరికా వెళ్దామనుకుంటున్నాను. అక్కడ 88 రోజులు ఉండాలన్నది ఆలోచన. అమెరికాలో కాలుపెట్టే నాటికి నా వీసా చెల్లుబాటు గడువు 6 నెలల 12 రోజులుంటుంది. 2019 జనవరి ప్రాంతంలో వీసాను పునరుద్ధరించు కోవాలనుకుంటున్నాను. 6 నెలల ముందుగా వీసా పునరుద్ధరణ కాదని ట్రావెల్‌ ఏజెంటు చెబుతున్నారు?

- ఎ.పద్మనాభరావు

వీసా చెల్లుబాటయ్యే కాలంలో మీరు అమెరికా వెళ్లవచ్చు. అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వెళ్లేందుకు మాత్రమే వీసా అనుమతిస్తుంది. అమెరికాలోకి అనుమతించాలా? అనుమతిస్తే ఎంతకాలం అన్నది ప్రవేశ ప్రాంతంలోని ఇమిగ్రేషన్‌ అధికారి నిర్ణయిస్తారు. కాలం తీరక ముందుగానే వీసాను పునరుద్ధరించుకోవాలనుకుంటే ఇంటర్వ్యూ మినహాయింపునకు అర్హతపొందవచ్చు. మరింత సమాచారం కోసం www.ustraveldocs.com/in ను చూడండి.

నేనూ, నా భార్య మా హెచ్‌1బి వీసాలను హెచ్‌4 హోదాకు మార్చుకుందామనుకుంటున్నాము. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాం. హెచ్‌-4 హోదా మార్పు(సీవోఎస్‌) ఎప్పటికి మారుతుంది. దరఖాస్తు చేసిన నాటి నుంచా? అందినట్లు రశీదు వచ్చిన తరవాత నుంచా? సీవోఎస్‌ దరఖాస్తు చేసుకున్నాక హెచ్‌1బి హోదాకు విరామం ఏర్పడుతుందా? హెచ్‌-4, హెచ్‌-4ఈఏడీ ఇబ్బందులేమిటి? హెచ్‌-4, హెచ్‌-4 ఈఏడీల అసమానతలు హెచ్‌1బి ప్రీమియం బదిలీతోపాటే నిర్ణయమై ఉంటాయా?

- కేపీ

వీసా స్థితికి సంబంధించి నిర్ణయాలను యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) నిర్వహిస్తుంది. మరింత సమాచారం కోసం వారి వెబ్‌సైట్‌ ttps://www.uscis.gov/visitunivted-stateshange-my-nonimmigrant-status-categoryhange-my-nonimmigrant-status ను పరిశీలించండి.

* వీసాలకు సంబంధించిన నిర్దుష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేేయండి. 
*  సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలనుusvisa@eenadu.net కు పంపగలరు.

పిటిషన్‌ చెల్లుబాటులో ఉంటే ప్రయాణం చేయవచ్చు 

పిటిషన్‌ చెల్లుబాటులో ఉంటే ప్రయాణం చేయవచ్చు 


ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించిన అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి... 
హెచ్‌1బి వీసాపై అమెరికాలోని ఓ క్లయింటు వద్ద పని చేస్తున్నాను. ఆ సంస్థ నుంచి మారాలనుకుంటున్నాను. హెచ్‌1బి వీసాను బదలాయించేందుకు నూతన యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈలోగా భారత్‌ వద్దామనుకుంటున్నాను. తిరుగు ప్రయాణంలో ఇబ్బంది అవుతుందా?   - వెంకటరాజు కేవీ 
అమెరికాలో మీరు పని చేస్తున్న యాజమాన్యం ద్వారా వచ్చిన పిటిషన్‌ చెల్లుబాటులో ఉంటే ప్రస్తుత హెచ్‌1బి వీసాపై మీరు ప్రయాణం చేయవచ్చు. నూతన పిటిషన్‌ ఆమోదం పొందే సమయానికి మీరు అమెరికా వెలుపల ఉన్న పక్షంలో నూతన వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. వర్క్‌ వీసా సమాచారానికి www.uscis.gov ను చూడండి.

డిపెండెంట్‌ వీసాపై అమెరికాలో ఉంటున్నాను. అమెరికా రాక మునుపు 2015లో ఎఫ్‌-1 వీసా కోసం రెండు దఫాలు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. వివాహం తరవాత భర్తతో కలిసి అమెరికా వచ్చాను. ఇక్కడ మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. హెచ్‌-4 వీసా నుంచి ఎఫ్‌-1 వీసా మార్చుకోవచ్చా?  - పద్మజా వెలిమినేడు 
చెల్లుబాటు అయ్యే హెచ్‌-4 వీసా ద్వారా విద్యా సంస్థలకు హాజరయ్యేందుకు అర్హులే. మీరు కూడా ఎఫ్‌-1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో ఇతర దరఖాస్తుదారుల మాదిరిగానే మీరు ఎఫ్‌-1 వీసాకు అర్హులా? కాదా? అన్నది కాన్సులర్‌ అధికారి నిర్ణయం తీసుకుంటారు. అమెరికాలో విద్యాభ్యాసం తదితర సమాచారం కోసం ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఎ వెబ్‌సైట్‌ Rhttps://educationusa.gov ను పరిశీలించండి.

పర్యాటక వీసా దరఖాస్తు విధానమేమిటి?  - శ్రీనివాసరాజు మంగపూడి 
వీసా ప్రక్రియలో తొలిదశ వెబ్‌సైట్‌లో మీ ప్రొఫైల్‌ను తయారు చేసుకోవటం, ఎమ్మార్వీ ఫీజు చెల్లించటం, వేలిముద్రల కోసం వీసా దరఖాస్తు కేంద్రంలో సమయాన్ని షెడ్యూల్‌ చేసుకుని ఆ తరవాత కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకు అపాయింటుమెంటును షెడ్యుల్‌ చేసుకోవాలి. దరఖాస్తు విధానాన్ని ‌www.traveldocs.com/in లో వివరించారు. మరింత సమాచారానికి 040 4625 8222, 0120 4844644 నంబర్లకు ఫోన్‌ చేయండి.

నేను విద్యార్థి వీసా(ఎఫ్‌-1)దారుడను. భారతదేశం వద్దామనుకుంటున్నాను. నా వీసా, పాస్‌పోర్టులు చెల్లుబాటులో ఉన్నాయి. ఎస్‌ఈవిఐఎస్‌ నంబరులోనూ మార్పులు లేవు. అయితే, ఎఫ్‌-1 వీసాదారులు మాతృదేశానికి వెళితే మళ్లీ స్టాంపింగ్‌ చేయించుకోవాలని నా మిత్రులు చెబుతున్నారు. ఇది ఎంత వరకు వాస్తవం? - రమేష్‌ కాశీనాధుని 
కొన్ని కేసుల్లోనే నూతన వీసా కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి ఎస్‌ఈవిఐఎస్‌ నంబరులో, విశ్వవిద్యాలయంలో మార్పులున్నా, అమెరికాలో చివరిసారిగా చదువుకుని అయిదు నెలలు దాటిన వారే నూతన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.


మీకేమైనా ప్రశ్నలుంటే 040 4625 8222, 0120 4844644 నంబర్లకు ఫోన్‌ చేయండి లేదా ‌supportindia@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేయండి. 
వీసాలకు సంబంధించిన నిర్దిష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను supportindia@ustraveldocs.com  కు ఈ-మెయిల్‌ చేేయండి. 
మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసాసేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.net కు పంపగలరు.
వీసా పునరుద్ధరణ సాధ్యం కాదు! 

వీసా పునరుద్ధరణ సాధ్యం కాదు! 

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు... హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి... 
*హెచ్‌1బి వీసాపై అమెరికాలో 2011 నుంచి 2014 మధ్య కాలంలో రెండున్నరేళ్లపాటు పని చేశాను. హెచ్‌1బి కింద ఇచ్చే ఆరేళ్ల కోటాను వినియోగించుకోలేదు. 2014 సెప్టెంబరులో హెచ్‌1బి వీసా కాలం తీరింది. దాన్ని పునరుద్ధరించుకోవచ్చా?

- ఉదయ్‌

ఆ వీసాను పునరుద్ధరించుకోలేరు. హెచ్‌1బి నూతన వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో మీపక్షాన పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలి. ఆ పిటిషన్‌ను యూఎస్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ ఆమోదించాలి. నూతన పిటిషన్‌ ఆమోదం పొందిన తరవాత హెచ్‌1బి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి, అపాయింటుమెంటును ఎలా షెడ్యూల్‌ చేసుకోవాలి తదితర సమాచారం కోసం ‌www.ustraveldocs.com/in ను చూడండి.


*2019 ఫిబ్రవరిలో నా వీసా కాలం చెల్లనుంది. 2018 డిసెంబరులో తొమ్మిది రోజులపాటు బిజినెస్‌ ట్రిప్‌పై అమెరికా వెళదామనుకుంటున్నాను. ఏదైనా సమస్య వస్తుందా? వీసా పునరుద్ధరించుకున్న తరవాత వెళ్లమంటారా?            - రవికిరణ్

వీసా చెల్లుబాటులో ఉన్న సమయంలో ఎప్పుడైనా మీరు ప్రయాణం చేయవచ్చు. వీసాలో నమోదు చేసిన తేదీ వరకు అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వెళ్లేందుకే మీ వీసా అనుమతిస్తుంది. అమెరికాలోకి మిమ్మల్ని అనుమతించాలా? లేదా? అనుమతిస్తే ఎంత కాలం? అన్నది ప్రవేశప్రాంతంలోని ఇమిగ్రేషన్‌ అధికారి నిర్ణయిస్తారు. వీసా గడువు తీరేలోగా పునరుద్ధరించుకోవచ్చు. ఇంటర్వ్యూ మినహాయింపునకు కూడా మీరు అర్హత పొందవచ్చు. మరింత సమాచారానికి www.ustraveldocs.com/in ను పరిశీలించండి.*  అమెరికాలో పీహెచ్‌డీ చేద్దామనుకుంటున్నాను. విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుందా? 

- రామ్మోహన్‌ కేఎస్‌

అమెరికాలోని చాలా విశ్వవిద్యాలయాలు స్కాలర్‌షిప్పులు, ఫెలోషిప్పులు ఇతర విధానాల ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక్కో విశ్వవిద్యాలయం ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఏ విశ్వవిద్యాలయంలో చదవాలని మీరు నిర్ణయించుకుంటారో అక్కడి ఆర్థిక సహాయ విభాగాన్ని నేరుగా సంప్రదించండి. మరింత సమాచారం కోసం ‌www.usief.org.in ను చూడండి.*సీనియర్‌ సిటిజన్‌ అయిన నేను గడిచిన మూడేళ్లలో ఏడు దఫాలు అమెరికాలో పర్యటించాను. ఈ ఏడాది డిసెంబరులో నా వీసా కాలం తీరనుంది. డ్రాప్‌ బాక్స్‌ విధానం ద్వారా వీసా పునరుద్ధరణ చేసుకోవచ్చా? లేక వీసా ఇంటర్వ్యూ కోసం హాజరుకావాలా?

- పి.కోటేశ్వరరావు

* ఇంటర్వ్యూ మినహాయింపు కోసం మీరు అర్హత పొందవచ్చు. మీరు అర్హులా? కాదా? అన్నది పరిశీలించేందుకుhttps://www.ustraveldocs.com/in/in-niv-visarenew.asp ను చూడండి. ఇంటర్వ్యూ మినహాయింపు నిబంధనలకు మీరు అర్హులు కాకపోతే వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అదే వెబ్‌సైట్‌ ద్వారా అపాయింటుమెంటును షెడ్యూల్‌ చేసుకోండి.* వీసాలకు సంబంధించిన నిర్దిష్టమైన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support n india@ustraveldocs.com కు ఈ-మెయిల్‌ చేయండి. 
* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు. 
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలనుusvisa@eenadu.net  కు పంపగలరు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.