అమెరికాలోనూ ‘వకీల్‌సాబ్‌’ వసూళ్ల హవా
అమెరికాలోనూ ‘వకీల్‌సాబ్‌’ వసూళ్ల హవా

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు విదేశాల్లోనూ అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అమెరికాలోనూ ‘వకీల్‌సాబ్‌’ హవా నడుస్తోంది. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘వకీల్‌సాబ్‌’ను డైరెక్టర్‌ వేణుశ్రీరామ్‌ తెరకెక్కించారు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. అమెరికాలో బుధవారం ఒక్కరోజే 117 ప్రాంతాల్లో 8,311 డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా 7,10,952 డాలర్లు రాబట్టింది. ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేసింది. నివేదాథామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. తమన్‌ సంగీతం ఇచ్చారు.మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని