
రామన్నపేట: కరోనా వైరస్ విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌తో జనమంతా ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో పనుల్లేక తీవ్ర అవస్థలు పడుతున్న పేదలకు కొందరు దాతలు ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే యూకేలో యూరాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ అశోక్ భువనగిరి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రామన్నపేట మండలంలోని బోయనపల్లిలో గ్రామస్థులకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు ముందుకొచ్చారు. కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు తొలగిపోయే వరకు 50 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. తన తండ్రి భువనగిరి సత్యనారాయణ జ్ఞాపకార్థం ఈ విపత్కర పరిస్థితుల్లో 50 కుటుంబాలకు ఆయన నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నారు.
వార్తలు / కథనాలు
జిల్లా వార్తలు
దేవతార్చన
- ‘బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను’
- అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?
- దోచుకున్న నాలుగు గంటలకే దొరికేశారు
- RRR రిలీజ్.. ఇది అన్యాయం: బోనీకపూర్
- థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్
- వెజ్ బఫె రూ.500, నాన్‌వెజ్ బఫె రూ.700
- 21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
- ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
- అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య
- మదనపల్లె కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు