close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌.. నోరెళ్లబెట్టిన నెటిజన్లు

పోస్టులో ఊహించని ట్విస్ట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలమయ్యింది. ఇంకా అనేక దేశాలు వైరస్‌ గుప్పిట్లోనే నలుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా విహారయాత్రలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వైరస్‌ కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో ఓ ఆసక్తికర పోస్టు చేశారు. విహారయాత్రకి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అంటూ ఓ ట్వీట్‌ చేశారు. ఆ పోస్టు నెటిజన్లలో విపరీతమైన ఆసక్తి రేపింది. కానీ అందులోని ట్విస్ట్‌ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా.. మీరు తర్వాత విహారానికి ఎక్కడి వెళ్లాలనుకుంటున్నారో చెప్పండి అంటూ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. విహారానికి ప్రసిద్ధి చెందిన న్యూజిలాండ్‌, మెక్సికో, కెనడాతోపాటు పలు దేశాల పేర్లను అందులో ఉంచారు. తర్వాత మీరు ఎక్కడి వెళ్లాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని అందులో పేర్కొన్నారు. పక్కనే ఓ పజిల్‌ను ఉంచి దాన్ని పరిష్కరించగా వచ్చిన సంఖ్య ఉన్న ప్రాంతానికి వెళ్లండి అంటూ పేర్కొన్నారు. దీంతో ఆసక్తి కనబర్చిన నెటిజన్లు సులువుగానే ఆ పజిల్‌ను పరిష్కరించారు. కానీ ప్రతి ఒక్కరికీ ఒకే సమాధానం రావడం గమనార్హం. ఆ సమాధానం వచ్చిన 9వ సంఖ్య విహార ప్రదేశాన్ని చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. మొత్తం 15 సంఖ్యల్లో 14 పలు దేశాల పేర్లు సూచిస్తుండగా.. 9వ నంబరు అంకె మాత్రం ‘ఇంట్లోనే ఉండండి’ అని సూచిస్తోంది. విపత్కర పరిస్థితుల్లో విహారానికి ఎక్కడికీ వెళ్లొద్దనీ, ఇంట్లోనే క్షేమంగా ఉండాలన్నిది  ఆనంద్‌ మహీంద్రా సూచన. 


వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు