close
భారతీయ విద్యార్థుల హక్కులను కాపాడండి

బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం

దిల్లీ: బ్రిటన్‌లో చదువుకోవాలనే విద్యార్థుల వీసాల విషయంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించాల్సిందిగా భారత ప్రభుత్వం యూకేని కోరింది. బ్రిటన్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల హక్కులను కాపాడాలని సూచించింది.  వారికి వీసా సంబంధ సమస్యలను తీర్చాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్‌ కుమార్ భల్లా..యూకే హోం శాఖ కార్యాలయం డైరెక్టర్ జనరల్‌ గ్లిన్‌ విలియమ్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాల ప్రతినిధులు సమావేశమైన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న వీసా సంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఇమ్మిగ్రేషన్‌, పౌరసత్వానికి సంబంధించిన సమస్యల అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు యూకే అధికారులు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

వీసాల విషయంలో గతేడాది యూకే తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీసింది. బ్రిటన్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే ఇతర దేశాల విద్యార్థులకు వీసా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే దేశాల జాబితాలో భారత్‌ను చేర్చలేదు. ఇందుకోసం బ్రిటన్ హోం శాఖ కార్యాలయం టైర్‌ 4 వీసా కేటగిరిలో ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల విద్యార్థులకు ఊరట కల్పించింది. ఇందులో భారత్‌ను విస్మరించడంపై విమర్శలు ఎదుర్కొంది.  బ్రిటన్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అవమానించిందన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంది. 

విదేశీ విద్యార్థుల కోసం కొన్ని రోజుల క్రితం బ్రిటన్‌ ప్రభుత్వం కొత్త వీసా విధానాలను తీసుకొచ్చింది. బ్రిటన్‌లో చదివే విద్యార్థులకు రెండేళ్ల పాటు వర్క్‌వీసాను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విధానం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు ఎక్కువ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో వీసా సమస్యలను తీర్చాలని కేంద్రం కోరింది.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.