close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విదేశాల్లో సుశాంత్‌ చివరి చిత్రం హవా!

తక్కువ స్క్రీన్లు అయినప్పటికీ...

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బేచారా’. సంజనా సంఘీ, సైఫ్‌ అలీ ఖాన్‌, షాహిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖేశ్‌ చబ్రా దర్శకుడు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌ థియేటర్లు మూతపడంతో ఓటీటీ వేదికగా డిస్నీ, హాస్టార్‌లో విడుదలైన చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. న్యూజిల్యాండ్‌, ఫిజిలో థియేటర్లు నడుస్తుండటంతో నిర్మాతలు అక్కడ విడుదల చేయగా.. విశేష స్పందన పొందింది. విదేశాల్లో బాక్సాఫీసు వద్ద సినిమా సత్తా చాటింది. హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నొలన్‌ తీసిన ‘టెనెంట్‌’కి పోటీగా నిలిచి వసూళ్లు సాధించిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. తక్కువ స్క్రీన్లపై, తక్కువ షోలు వేసినప్పటికీ సినిమా న్యూజిల్యాండ్‌లో 48,436 డాలర్లు, ఫిజిలో 33,864 డాలర్లు సాధించినట్లు చెప్పారు. విదేశాల్లో చిత్రానికి అద్భుతమైన స్పందన లభించిందని ట్వీట్‌ చేశారు.

2019లో సుశాంత్‌ ‘చిచ్చోరే’, ‘డ్రైవ్‌’ (నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘చిచ్చోరే’ సినిమా ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద సైతం విజయం సాధించింది. దీని తర్వాత సుశాంత్‌ ‘దిల్‌ బేచార్‌’లో నటించారు. జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకుని అందర్నీ షాక్‌కు గురి చేశారు. ఆయన మృతి పట్ల అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. మరోపక్క ఆదివారంతో (సెప్టెంబరు 6) ‘చిచ్చోరే’ సినిమా విడుదలై ఏడాదైన సందర్భంగా కథానాయిక శ్రద్ధా కపూర్‌ సుశాంత్‌ను గుర్తు చేసుకున్నారు. మేకింగ్‌ వీడియో షేర్‌ చూస్తూ.. నటుడ్ని మిస్‌ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు