‘ఎన్నారైస్‌ ఫర్ అమరావతి’కి షార్లెట్ ప్రవాసాంధ్రుల విరాళం
close
‘ఎన్నారైస్‌ ఫర్ అమరావతి’కి షార్లెట్ ప్రవాసాంధ్రుల విరాళం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమరావతి రైతుల ఉద్యమానికి ప్రవాసాంధ్రులు తమ వంతు సాయం అందిస్తున్నారు. జన్మభూమి రుణం తీర్చగ పిడికిలి ఎత్తి.. కదంతొక్కి నినదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అణిచివేయాలని చూస్తున్న నేపథ్యంలో పలువురు ప్రవాసాంధ్రులు రైతులకు అండగా నిలుస్తున్నారు. 'ఒక రాష్ట్రం-ఒక రాజధాని' నినాదంతో ఉద్యమిస్తున్న రైతులకు తమ వంతు ఆర్థిక సాయం అందజేసేందుకు #NRIsFORAMARAVATI అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు అమెరికాలోని నార్త్ కరోలినా  రాష్టం షార్లెట్ సిటీ ప్రవాసాంధ్రులు  రూ.25లక్షలు విరాళమిచ్చారు.  షార్లెట్ సిటీ ప్రవాసులు ఠాగూర్‌ మల్లినేని, నాగ పంచుమర్తి, నితిన్ కిలారు, శ్రీనివాస్ పాలడుగు, బాలాజీ తాతినేని, శ్రీనివాస్ చందు గొర్రెపాటి ఆధ్వర్యంలో షార్లెట్ నగరానికి చెందిన 130 మంది ప్రవాసాంధ్రులు రెండు రోజుల వ్యవధిలోనే రూ.25లక్షలు ($31,454) సేకరించి #NRIsFORAMARAVATI సంస్థకు అందజేశారు. 

 


మరిన్ని