close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీఎంసీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబరు 1న గుంటూరు మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. జూమ్‌ వేదికగా నిర్వహించిన ఈ సమ్మేళనంలో 1978 బ్యాచ్‌ విద్యార్థులంతా పాల్గొన్నారు. భారత్‌, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా సహా ప్రపంచంలోని నలుమూలలా ఉంటున్న వారంతా ఆన్‌లైన్‌ వేదికగా ఒక్కటయ్యారు. సుమారు ఐదు గంటల పాటు ఈ సమ్మేళనం జరిగింది.

డాక్టర్‌ కె.సుజాత (హైదరాబాద్‌) జ్యోతి ప్రజ్వలన చేయగా.. పద్మజ (లివర్‌ పూల్‌, యూకే) ప్రార్థనా గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్‌ వర్దన్‌ రెడ్డి (అమెరికా) ప్రారంభోపన్యాసం చేశారు. డాక్టర్‌ నరేంద్ర (హైదరాబాద్‌‌), డాక్టర్‌ శ్రీనివాసులు (హైదరాబాద్‌), డాక్టర్‌ వేణుగోపాల్‌ (కాకినాడ) తమ బ్యాచ్‌ గురించి వివరించారు. కొవిడ్‌-19తో ఇటీవల మరణించిన సహచర విద్యార్థి డాక్టర్‌ యోగేంద్ర బాబు మృతిపట్ల తోటి పూర్వవిద్యార్థులు సంతాపాలు తెలియజేశారు. అలాగే కీర్తిశేషులైన తమ ఉపాధ్యాయులకు నివాళులర్పించారు. డాక్టర్‌ కేవీఎల్‌ నరసింహ మూర్తి (మంచిర్యాల), భాను ప్రభాకర్‌ (విజయవాడ) ఉపాధ్యాయుల జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. డాక్టర్‌ మహేశ్‌ (అమెరికా), డాక్టర్‌ సత్యనారాయణ ప్రసాద్‌ (అమెరికా), డాక్టర్‌ కృష్ణ కుమార్‌ (హైదరాబాద్‌‌), డాక్టర్‌ శుభకర్‌ (హైదరాబాద్‌) యోగేంద్ర బాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌ సునీత (అమెరికా) యేగంద్రబాబునుద్దేశించి కవిత రాశారు.

కొవిడ్‌ కారణంగా మరణించిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పూర్వ విద్యార్థులు నివాళులర్పించారు. గతంలో యూకేఈలో ‘స్వరాభిషేకం’ కార్యక్రమం ఏర్పాటు చేసిన డాక్టర్‌ నగేశ్‌ (యూకే) బాలసుబ్రహ్మణ్యంతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. డాక్టర్‌ విజయ (గుంటూరు), డాక్టర్‌ దుర్గా ప్రసాద్‌ (అద్దంకి), డాక్టర్‌ వీరెన్‌ (విజయవాడ), డాక్టర్‌ రాజశేఖర్‌ (గుంటూరు), డాక్టర్‌ సుధ (వైజాగ్‌), డాక్టర్‌ సుజాత, డాక్టర్‌ యాస్మిన్‌ (గుంటూరు), డాక్టర్‌ విజయ లక్ష్మి (విజయవాడ), డాక్టర్‌ మీనాక్షి (అమెరికా), డాక్టర్‌ సునీత (అమెరికా), డాక్టర్‌ వాణి (వైజాగ్‌), డాక్టర్‌ ప్రమీల (పాల్వంచ), డాక్టర్‌ ఫరణి కుమార్‌ (గుంటూరు), డాక్టర్‌ దినకర్‌ (అమెరికా), డాక్టర్‌ వెంకట్రావు (అమెరికా) తదితరులు ఎస్పీబీ పాడిన పాటలను ఆలపించారు. డాక్టర్‌ సుజాత (పాండిచ్చేరి), డాక్టర్‌ రాఘవ శర్మ (గుంటూరు), డాక్టర్‌ సుబ్బారావు (గుంటూరు) ఎస్పీబీ పాటలను వినూత్నంగా ఆలపించారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్‌ సుధ (విశాఖ‌) ‘మా తెలుగు తల్లికి’ ఆలపించారు.  డాక్టర్‌ మహేశ్‌ (అమెరికా) ఈ కార్యక్రమానికి సాంకేతిక పర్యవేక్షకులుగా వ్యవహరించారు. సినీ నేపథ్య గాయకులు మల్లికార్జున (చెన్నై), అమెరికా గాన కోకిల అకునూరి శారద ఎస్పీబీ పాడిన పాటలను ఆలపించంతో పాటు ఆయనతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. 1978 బ్యాచ్‌ సాయంతో చేపట్టిన పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ వివరాలను డాక్టర్‌ సుధాకర్‌ (గుంటూరు) వివరించారు.

1978 బ్యాచ్‌ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2018లో రామోజీ ఫిల్మ్‌సిటీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం మూడు రోజుల పాటు జరిగింది. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్వ విద్యార్థులకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహన్‌, ఈనాడు ఎండీ కిరణ్‌, సుధాకర్‌ బాబు, బాపినీడు, నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. నాటి సమ్మేళనాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసుకున్నారు.

Tags :

మరిన్ని