
భారత్ వచ్చేందుకు కేంద్రం అనుమతి
దిల్లీ: ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారత్‌కు వచ్చేందుకు వారికి అనుమతిచ్చింది. అయితే, కొన్ని నిబంధనలు విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 7న వీసాలపై నిషేధం విధించింది. తాజాగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందే భారత్ మిషన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో ఓసీఐ కార్డుదారులకు భారత్‌కు వచ్చేందుకు కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చింది.
* విదేశాల్లో ఉన్న భారతీయులకు జన్మించి, ఓసీఐ కార్డు కలిగిన వారిని భారత్‌కు వచ్చేందుకు అనుమతిస్తారు.
* కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించడం వంటి అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత్‌కు రావాలనుకునే ఓసీఐ కార్డుదారులు ప్రయాణించొచ్చు.
* భారత్‌లో శాశ్వత నివాసం కలిగి ఉన్న భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరికి ఓసీఐ కార్డు ఉంటే వారికి భారత్‌కు వచ్చే అవకాశం ఇస్తారు.
* విదేశీ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఓసీఐ కార్డు కలిగిన విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు అనుమతి ఉంది. అయితే, వారి తల్లిదండ్రులు భారత పౌరులై భారత్‌లో నివసిస్తున్నవారై ఉండాలి.
వార్తలు / కథనాలు
దేవతార్చన
- ‘బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను’
- అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?
- దోచుకున్న నాలుగు గంటలకే దొరికేశారు
- RRR రిలీజ్.. ఇది అన్యాయం: బోనీకపూర్
- థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్
- వెజ్ బఫె రూ.500, నాన్‌వెజ్ బఫె రూ.700
- ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
- 21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
- అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య
- మదనపల్లె కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు