close
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం..భారతీయుడి మృతి

కైరో: ఈజిప్టులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భారత్‌కు చెందిన 26 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు.. ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే చనిపోయిన విషయాన్ని కైరోలోని భారత రాయబార కార్యాలయం ఇంకా ధ్రువీకరించలేదు. కేవలం రోడ్డు ప్రమాదం సంభవించినట్లు మాత్రమే పేర్కొంది. పర్యాటకులు హర్‌ఘడా నగరానికి వెళుతుండగా.. సోఖ్నా-ఝఫరానా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో వెనకాలే వస్తున్న మరో బబ్సు కూడా ట్రక్కును ఢీకొట్టింది. రెండో బస్సులో ఆసియాకు చెందిన పర్యాటకులు ఉన్నారు. దీంతో మొత్తం ఆరుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఓ భారతీయుడు సహా ఇద్దరు మలేషియావాసులు, ముగ్గురు ఈజిప్టు దేశస్థులు ఉన్నట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని సూయెజ్‌, కైరోలోని ఆసుపత్రులకు తరించారు. భారత ప్రతినిధులు ప్రస్తుతం ఆసుపత్రుల్లోనే ఉన్నారు. సహాయార్థం +20-1211299905, +20-1283487779 హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.