
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నారైలు తాము ఎదుగుతూనే నలుగురి క్షేమాన్ని కాంక్షిస్తారు. అలాంటి వారిలో ఒకరు శశికాంత్ వల్లేపల్లి, ఆయన కుటుంబం. వీరు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎందరికో సాయం చేశారు. తాజాగా హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలోని తుర్కయంజల్ మున్సిపాలిటీలోని మునగనూరులో గల సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్ ఆశ్రమ పాఠశాలకు శశికాంత్, ఆయన సతీమణి, క్యూహబ్ సీఈవో ప్రియాంక వల్లేపల్లిలు పాఠశాలకు అవసరమైన నిత్యావసరాలను విరాళంగా అందజేశారు. గతవారం వారు 30మంది విద్యార్థినులకు రూ.5లక్షల ఉపకారవేతనాలను అందించి.. 50 మంది విద్యార్థినుల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు.
కాగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక తరగతిని దత్తత తీసుకుని నిర్వహణ ఖర్చు మొత్తం భరిస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. విద్యార్థినులు అందరూ బాగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు. బాలికల కోసం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న వేమూరి విజయలక్ష్మిని ఎన్నారై దంపతులు అభినందించారు.
వార్తలు / కథనాలు
దేవతార్చన
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం