close
ఉగ్రవాదంపై పోరుకు ఒక్కటవ్వాలి: మోదీ

ఐక్యరాజ్యసమితి: శాంతి, సామరస్యాలే ప్రపంచానికి భారత్‌ ఇచ్చే సందేశమని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లలో ఉగ్రవాదం ఒకటన్నారు. జాతిపిత మహాత్మగాంధీ చెప్పిన సత్యం, అహింస నేటికీ అనుసరణీయమని మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రజా సంక్షేమం, కాలుష్య నివారణ, డిజటలైజేషన్‌కు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూనే ఉగ్రవాదంపై ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

‘‘సత్యం, అహింస మహాత్ముడు అనుసరించిన సిద్ధాంతాలు. ఆయన సిద్ధాంతాలు నేటికీ అనుసరణీయమే. ఈ ఏడాది ఆయ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ ఐదేళ్లలో 11 కోట్ల శౌచాలయాలను నిర్మించాం. ఇది ప్రపంచానికి కొత్త సందేశం. దేశంలోని 50 కోట్ల మంది ప్రజలకు రూ.5లక్షల బీమా కల్పిస్తున్నాం. డిజిటలీకరణతో ద్వారా అవినీతిని అడ్డుకట్ట వేస్తున్నాం. ఇప్పటికే 20 బిలియన్ల డాలర్ల మేర ప్రజాధనం ఆదా అయ్యింది. అక్టోబర్‌ 2 నుంచి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నాం. 15 కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందిస్తాం. 2022 నాటికి పేదలకు 2 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నాం. 2025 నాటికి క్షయ విముక్త భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటాం’’ అని మోదీ వివరించారు.

‘‘అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు మాకు రెండోసారి అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన భారీ ఆధిక్యత వల్లే ఇక్కడికి వచ్చే భాగ్యం దక్కింది. మేం చేస్తున్న కృషి భారత్‌కే కాదు.. ప్రపంచానికీ బలాన్నిస్తుంది. కాలుష్య కారకాల్లో భారత్‌ చివరి వరుసలో ఉంది. అదే సమయంలో కాలుష్య నివారణ చర్యల్లో మాత్రం భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఉగ్రవాదాన్ని అణచివేయడం ఏ దేశానికీ పెద్ద కష్టమైన పనేమీ కాదు. ప్రపంచమంతా ఏకమై టెర్రరిజంపై కలిసి పోరాడాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.