close
కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

మిల్పిటాస్: కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఈ నెల 23న ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయంలోని డా.హనిమిరెడ్డి లక్కిరెడ్డి భవన్‌లో జరిగిన ఈ స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, చంద్రగిరి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. భారతదేశానికి దూరంగా ఉన్నప్పటికీ తెలుగు భాష, సంస్కృతికి సిలికానాంధ్ర చేస్తున్న సేవలను కరుణాకర్ రెడ్డి కొనియాడారు. త్వరలోనే తితిదే బోర్డుతో చర్చించి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్యర్యంలో తిరుపతిలో అన్నమయ్య లక్ష గళార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సిలికానాంధ్ర చేపట్టిన మనబడి, సంపద, విశ్వవిద్యాలయం, రోటరీ, సంజీవని వంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ బృందం, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విశ్వవిద్యాలయ పత్రిక ‘శాస్త్ర’, అంతర్జాల పత్రికను వారు ఆవిష్కరించారు.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి, కర్ణాటక సంగీతం, భరతనాట్యం, సంస్కృతం, తెలుగు కోర్సులలో మాస్టర్స్, డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నట్లు సిలికానాంధ్ర అధ్యక్షుడు ఆనంద్‌ కూచిభొట్ల తెలిపారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నలంద తక్షశిలలు మనకు ఆదర్శంగా నిలుస్తాయని.. భారతీయ కళలు, భాష, విజ్ఞానాన్ని అందించేందుకు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటికే మనబడి ద్వారా 55 వేల మందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు బోధిస్తున్నామని చెప్పారు. సంపద కార్యక్రమం ద్వారా 3000 మందికి పైగా విద్యార్థులు సంగీతం, నాట్యం కోర్సుల్లో సర్టిఫికెట్‌లు అందుకున్నారని వివరించారు. అనంతరం ముఖ్య అతిథులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విద్యార్థులకు పట్టాలు అందించారు.

స్నాతకోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంగీత నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారతీయ విజ్ఞాన ఔనత్యం, భగవద్గీత అందించిన సుపరిపాలన సూత్రాలని (మేనేజ్‌మెంట్ స్కిల్స్) డా. మేడెపల్లి కామేష్‌ వివరించారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ఆనంద్ కూచిభొట్ల, ప్రొవోస్ట్ రాజు చమర్తి, ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల, దిలీప్ కొండిపర్తి, అకడమిక్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ డా. పప్పు వేణుగోపాల రావు, మమత కూచిభొట్ల, శ్రీవల్లి కొండుభట్ల, శ్రీదేవి గంటి,  శ్రీరాం కోట్ని,  జయంతి కోట్ని, శిరీష చమర్తి, సాయి కందుల, అధ్యాపకులు డా. ఆర్.ఎస్. జయలక్ష్మి, డా. యశోదా ఠాకూర్, డా. వసంత లక్ష్మి, డా. సి. మృణాళిని, డా. శ్రీరాం పరసురాం, తదితరులు పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.