close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మలేసియాలో అజిత్‌ క్రేజ్‌.. వీడియో వైరల్‌

‘వేదాలం’ రీ-రిలీజ్‌

చెన్నై: తమిళ స్టార్‌ అజిత్‌ నటించిన ‘వేదాలం’ సినిమా మరోసారి థియేటర్‌లో సందడి చేస్తోంది. మలేసియాలో ఈ సినిమాను రీ-రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం విడుదలై ఐదేళ్లు పూర్తయినప్పటికీ.. ఇంకా దానికున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. కరోనా నేపథ్యంలో థియేటర్‌లో సామాజిక దూరం పాటిస్తూ ప్రేక్షకులు కూర్చున్నారు. అజిత్‌ రైలు సన్నివేశం స్క్రీన్‌పై రాగానే విజిల్స్‌, కేకలతో థియేటర్‌ మారుమోగిపోయింది. ఈ సందర్భంగా తీసిన వీడియోను అభిమానులు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. అజిత్‌ అంటే తమకు ఎంతో అభిమానమని వీడియోలో జపాన్‌ వాసులు వారి భాషలో చెప్పుకొచ్చారు. ఇది ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

‘వేదాలం’ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. శ్రుతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. లక్ష్మీ మేనన్‌, రాహుల్‌ దేవ్‌ కీలక పాత్రలు పోషించారు. 2015 నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీసు వద్ద చక్కటి విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

అబుదాబిలో..

మరోపక్క అజిత్‌కు సంబంధించిన మరో అరుదైన వీడియో వైరల్‌గా మారింది. ‘బిల్లా’, ‘ఎంతవాడు గాని..’, ‘నేనూ రౌడీనే..’, ‘దర్బార్‌’ తదితర సినిమాలకు ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన సిత్రరాసు అజిత్‌ విదేశాల్లో ఉండగా తీసిన వీడియో షేర్‌ చేశారు. ‘ఆరంభం’ సినిమా కోసం అబుదబి వెళ్లినప్పుడు అజిత్‌ అక్కడి భవనాల్ని, కట్టడాల్ని కెమెరాతో చూస్తున్న వీడియో అది.




మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు