
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమాలు షాక్ ఇచ్చాయి. క్యాపిటల్ భవనంపై దాడులు చేసిన మూకలను గొప్ప దేశభక్తులుగా పేర్కొనడంతో ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సహా పలు సంస్థలు ఆయన ఖాతాలను తాత్కాలికంగా స్తంభింపజేశాయి. ట్రంప్ ఖాతాను 12 గంటల పాటు లాక్ చేస్తున్నట్టు ట్విటర్ బుధవారం రాత్రి ప్రకటించింది. అలాగే, అగ్రరాజ్యాధినేత చేసిన మూడు ట్వీట్లను తొలిసారి తొలగించింది. యూట్యూబ్, ఫేస్బుక్ కూడా అదేరకంగా వ్యవహరించాయి. ఆయన చేసిన పలు పోస్ట్‌లను తొలగించాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సంస్థలు ట్రంప్ తన పేజీలను యాక్సిస్ చేసుకొనే అవకాశం లేకుండా 24గంటల పాటు బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి. స్నాప్‌చాట్ కూడా ట్రంప్ ఖాతాను నిరవధికంగా బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది.
అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడిన మూకలను గొప్ప దేశ భక్తులుగా పేర్కొంటూ ట్రంప్ ట్వీట్ చేయడం, అలాగే, ఆ నిరసనకారులను ప్రేమిస్తున్నానంటూ వీడియో విడుదల చేయడం పెద్ద దుమారం రేపింది. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ ఉభయ సభలు సమావేశం కాగా.. వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు రణరంగం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
సారీ ప్రెసిడెంట్.. అలా చేయలేకపోయా...
వార్తలు / కథనాలు
దేవతార్చన
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి