close
ఆ కంపెనీలో లేకపోతే వీసా చెల్లదు

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరిట పాఠకుల నుంచి ‘ఈనాడు’ ఆహ్వానించిన ప్రశ్నలకు... హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు సమాధానాలిచ్చారు. అవి ఇలా ఉన్నాయి...
* అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ చదవాలనుకుంటున్నాను. మంచి విశ్వవిద్యాలయాన్ని గుర్తించటం ఎలా?

- రేవతి సీహెచ్‌

 అమెరికాలో చదువుకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ వెబ్‌సైట్‌ https://educationusa.state.govపాటు యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ (యూఎస్‌ఐఈఎఫ్‌) వెబ్‌సైట్‌ https://www.usief.org.inలను చూడండి. విద్యార్థి వీసా(ఎఫ్‌-1) కోసం దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన సమాచారం కోసం www.ustraveldocs.com/in పరిశీలించండి.
* 2019లో హెచ్‌1బి వీసా జారీ అయింది. ఆ వీసాపై అమెరికా వెళ్లలేదు. ఆమోదం పొందిన ఆ వీసాపై ప్రయాణం చేయవచ్చా? అక్కడ ఎన్ని రోజులు ఉండవచ్చు?

- సత్యనారాయణ మామిడాల

మీ హెచ్‌1బి వీసాలో పేర్కొన్న మేరకు ఆ కంపెనీలో అదే హోదాలో మీరు పని చేస్తూ ఉండాలి. మీ కోసం పిటిషన్‌ దాఖలు చేసిన కంపెనీలో మీరు పని చేస్తుండకపోయినా, మీ ఉద్యోగంలో ఏ అంశాలైనా మారినా ఆ హెచ్‌1బి వీసాపై ప్రయాణం చేయలేరు. వ్యాపార, పర్యాటక అంశాలపై అమెరికా వెళ్లాలనుకుంటే బి1/బి2 వీసా కోసం దరఖాస్తు చేసుకోండి. పని ఆధారిత వీసాల సమాచారానికి travel.state.gov చూడండి.
* ఈ ఏడాది జూన్‌లో వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నా పాస్‌పోర్టు ఇప్పటి వరకు అందలేదు. నా వీసా స్థితిని తెలుసుకోవటం ఎలా?

- శివరాం చేబియ్యం

 కోన్ని కేసుల్లో పరిపాలనాపరమైన ప్రక్రియను అదనంగా నిర్వహించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. ఆ ప్రక్రియ ఎప్పటికి పూర్తి అవుతుందన్నది ఇదమిత్థంగా చెప్పలేం. ఆ జాప్యం మిమ్మల్ని ఎంత ఆవేదనకు గురిచేస్తుందో అర్థం చేసుకోగలం. సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం. మీ వీసా స్థితిని తెలుసుకునేందుకు https://ceac.state.gov ను పరిశీలించండి.
* విద్యార్థి వీసా కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. అత్యవసర పరిస్థితుల కారణంగా ఇంటర్వ్యూకు హాజరుకాలేదు. ఫీజు చెల్లించే పని లేకుండా మరో దఫా అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చా? అపాయింట్‌మెంట్‌ కోసం ఎంత కాలం వేచి ఉండాల్సి వస్తుంది?

- శ్రీదేవ్‌ నాయుడు

అపాయింట్‌మెంట్‌ కోసం ustraveldocs డాష్‌బోర్డులో ఎడమవైపు ఉన్న ‘రీషెడ్యూల్‌ అపాయింట్‌మెంట్‌’ విభాగాన్ని క్లిక్‌ చేసి వేలిముద్రలు, వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ తీసుకోండి. వీసా ఫీజు చెల్లింపు రసీదును వినియోగంలోకి తీసుకువచ్చేందుకు 24 గంటలు పడుతుంది. ఆ రసీదు వినియోగంలోకి వచ్చిన తరవాత వేలిముద్రలు, ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్‌ నమోదు చేసుకోవచ్చు.


* వీసాలకు సంబంధించిన అంశాలు, తిరస్కారాలపై సందేహాలను support-india@ustraveldocs.comకు ఈ-మెయిల్‌ చేేయండి.
* సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov ను సంప్రదించవచ్చు.
* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించిన ప్రశ్నలను usvisa@eenadu.netకు పంపగలరు.

వార్తలు / కథనాలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.