భారత సంతతి న్యాయవాదులకు అరుదైన గౌరవం
భారత సంతతి న్యాయవాదులకు అరుదైన గౌరవం

న్యూయార్క్‌: యూఎస్‌లోని న్యూయార్క్‌ నగరంలో ఇద్దరు భారత సంతతి మహిళలకు అరుదైన గౌరవం లభించింది. అర్చనారావు, దీపా అంబేకర్‌ అనే ఇద్దరు మహిళా న్యాయవాదుల్ని క్రిమినల్‌, సివిల్‌ కోర్టులకు న్యాయమూర్తులుగా నియమిస్తూ న్యూయార్క్‌ మేయర్‌ డె బ్లేసియో ఉత్తర్వులు జారీ చేశారు. అర్చనారావు గతంలో న్యూయార్క్‌ కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయంలో 17 సంవత్సరాలు విధులు నిర్వహించారు. 2019 జనవరిలో మొదట సివిల్‌ కోర్టుకు మధ్యంతర న్యాయమూర్తిగా నియామకమయ్యారు. క్రిమినల్‌ కోర్టులోనూ ఆమె విధులు నిర్వహించారు. అర్చనా ఫర్‌దామ్‌ యూనివర్శిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. దీపా అంబేకర్‌ 2018 మేలో సివిల్ కోర్టు మధ్యంతర న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. దీనికి ముందు ఈమె న్యూయార్క్‌ నగర్ సీనియర్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో అటార్నీగా, ప్రజా భద్రతా విభాగ కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. క్రిమినల్‌ డిఫెన్స్‌ విభాగంలోనూ విధులు నిర్వహించారు. ర్యూట్జర్స్‌ కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించారు. మేయర్‌ బ్లేసియో మొత్తం 28 (కుటుంబ, క్రిమినల్‌, సివిల్‌) కోర్టులకు న్యాయమూర్తులను ప్రకటించగా వారిలో ఇద్దరు భారత సంతతి వారు ఉండటం విశేషం. 


మరిన్ని