ఇనుమంతైనా వాడరు!
close
ఇనుమంతైనా వాడరు!

అబుధాబీలో తొలి హిందూ ఆలయ నిర్మాణం
భారీగా పనులకు శ్రీకారం

2018లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో శంకుస్థాపన చేసిన ఆలయానికి పునాది పనులు గురువారం ప్రారంభమయ్యాయి.
నిర్మాణం: ఆలయ సముదాయం (కమ్యూనిటీ హాళ్లు, ఎగ్జిబిషన్‌ కేంద్రాలు సహా)
విస్తీర్ణం:  11 ఎకరాలు
స్థలం ఇచ్చింది: అబుధాబీ యువరాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయేద్‌

దుబాయ్‌: అద్భుత శైలిలో.. భారత ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అనుగుణంగా.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుధాబీలో భారీఎత్తున తొలి హిందూ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ  జరిగింది. బోచాసణ్‌వాసీ శ్రీ అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆధ్వర్యంలో నిర్మితం కానున్న ఈ స్వామి నారాయణ్‌ ఆలయం ఎన్నో విశేషాల సమాహారం.


విశిష్టతలెన్నెన్నో..

* హిందూ సంప్రదాయాలను అనుసరించి ఈ నిర్మాణంలో ఇనుము, ఉక్కు, సంబంధిత సామగ్రి ఏమాత్రం వాడరు. సిమెంటు, మార్బుల్‌, ఫ్లైయాష్‌ వంటివాటినే వినియోగిస్తారు.
* భారత్‌లోని ఆధ్యాత్మిక కట్టడాల నిర్మాణశైలి (ఆర్కిటెక్చర్‌)నే పాటిస్తారు.
* పునాదులకు 3000 క్యూబిక్‌ మీటర్ల మేర ఫ్లైయాష్‌ కాంక్రీట్‌ వేశారు.
* ఇనుముకు బదులు ‘జిగ్‌సా’ ఫ్లైయాష్‌ దిమ్మలను వాడుతున్నారు. గట్టిదనం కోసం ప్రత్యేకంగా ఫ్లైయాష్‌ను తయారు చేస్తున్నారు.


3,000 మంది

భారత్‌లో ఆలయ విగ్రహాలు, ప్రతిమల తయారీలో నిమగ్నమైన వారు. ఇవి 2022 నాటికి పూర్తికావచ్చని అంచనా. అనంతరం వాటిని యూఏఈకి తరలిస్తారు.


5,000 టన్నులు

ఆలయ నిర్మాణానికి  వాడుతున్న ఇటాలియన్‌ కరారా మార్బుల్‌.


12,250 టన్నులు

ఆలయ బాహ్య నిర్మాణానికి వినియోగించే పింక్‌ శాండ్‌స్టోన్‌ (ఎర్రరాయి)


 

Tags :

మరిన్ని