close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రవాసాంధ్రుల తోడ్పాటు అభినందనీయం: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం రైతులు చేసిన భూమి త్యాగాన్ని ప్రపంచం మొత్తం ప్రశంసిస్తే వైకాపా ప్రభుత్వం మాత్రం అక్రమ కేసులతో వేధిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులపై  రాష్ట్ర ప్రభుత్వం 2,500కు పైగా అక్రమ కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులు, ప్రవాసాంధ్రులు బుధవారం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబును కలిశారు. అమరావతి పోరాటానికి మద్దతుగా ప్రవాసాంధ్రులు రూ.15.71లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో చంద్రబాబుకు అందజేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పుణ్యభూమి రుణం తీర్చుకునేందుకు ప్రవాసాంధ్రులు ఇస్తున్న తోడ్పాటు అభినందనీయమని కొనియాడారు. అమరావతి కలల్ని వైకాపా ప్రభుత్వం చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి కోసం 92 రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందన్నారు. రాజధాని విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకు ధర్మ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని